అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్‌ స్థానం ..! హాట్‌టాపిక్‌గా అమెరికా వంటకాలు.. | TasteAtlas 100 Best Cuisines in the World India Ranked 12th | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్‌ స్థానం..! హాట్‌టాపిక్‌గా అమెరికా వంటకాలు..

Jul 2 2025 11:28 AM | Updated on Jul 2 2025 3:17 PM

TasteAtlas 100 Best Cuisines in the World India Ranked 12th

కొన్ని వంటకాలు యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ పొందుతాయి. అంతేగాదు ఆ వంటకాల కారణంగా ఆ దేశం పేరు, అక్కడ ప్రజల ఆహార విధానాలు ఫేమస్‌ అవుతాయి కూడా. అంతేగాదు వంటకాల కారణంగా దేశాధినేతలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాక నైపుణ్యంతో మహామహులనే మనసుదోచుకోవచ్చనే సామెత ఉండనే ఉంది కూడా. అందుకు చరిత్రలో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ట్రావెల్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యుత్తుమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో అమెరికా చేరడమే నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆ జాబితాలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉందంటే..

ప్రపంచవ్యాపంగా ఉన్న ఆహారప్రియులు ఇష్టపడే వంటకాల ఆధారంగా ర్యాంకుల ఇచ్చి మరీ జాబితాను అందించింది. ఆ జాబితాలో గ్రీస్ 4.60 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటలీ, మెక్సికో, స్పెయిన్, పోర్చుగల్‌ నిలిచాయి. వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి నిలయమైన భారత్‌ 12వ స్థానం దక్కించుకుంది. భారతదేశంలోని వంటకాలే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలగా నిర్ణయించి మరి ఈ ర్యాంకు ఇచ్చిందట. 

అలాగే మన దేశంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్‌ని కూడా ఇచ్చింది. అందేలె..రోటీ, నాన్, చట్నీ, బిర్యానీ, పప్పు, బటర్ చికెన్, తందూరి చికెన్  వంటి ప్రముఖ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో మన భారతీయులు సైడ్‌ డిష్‌గా తినే పచ్చడి(చట్నీ) కూడా ఆ జాబితాలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు భారతదేశంలో ఆయా వంటకాలను ఎక్కడ ఆస్వాదించాలో వంటి వాటి వివరాలను కూడా టేస్ట్‌ అట్లాస్‌ అందించడం విశేషం. 

అయితే ఈ సారి ది బెస్ట్‌ రెసిపీల్లో అమెరికా వంటకాలు చేరడమే సర్వత్ర చర్చనీయాంశమైంది. పైగా అది ఏకంగా భారత్‌ తర్వాతి స్థానంలో అమెరికా(13) చోటుదక్కించుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఎందుకంటే పెరూ(14),  లెబనాన్ (26), థాయిలాండ్ (28), ఇరాన్ (41) వంటి దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉండటంతో నెట్టింట రకరకాల చర్చలకు దారితీసింది. అసలు యూఎస్‌ వంటకాలంటే ఏంటి అంటూ సెటైర్లు వేస్తు కామెంట్లు చేయగా, మరికొందరు బ్రో ఉందిగా మెక్‌డొనాల్డ్స్ అని కామెడీ మీమ్స్‌తో పోస్టులు పెట్టారు.

 

(చదవండి: పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్‌..! నిపుణుల షాకింగ్‌ విషయాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement