Lakhbir Singh Rode: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్ రోడే మృతి

Khalistan Terrorist klf Chief Lakhbir Singh Rode Dies - Sakshi

పాకిస్తాన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్‌ఎఫ్‌)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్‌కు  చీఫ్‌. లఖ్బీర్‌  గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్‌ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు. భారత్‌ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. 

లఖ్బీర్‌ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్‌ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్‌ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్‌ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్‌లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో  ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్‌కి పారిపోయాడు. 

తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించేందుకు పాక్‌కు భారత్‌ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్‌ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్‌ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో  ప్రారంభించాడు. భారత్‌కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. 
ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్‌లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top