
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.
అయితే, మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇక, అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో వంశీని విడుదల కాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కూటమి కేసులు పెట్టింది.
