
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఐఏఎఫ్ ఆధ్వర్యంలో నలుగురు గగనయాత్రికులకు సన్మానం
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో ‘గగన్‌యాన్ మిషన్’ నూతన అధ్యాయానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లను ఆదివారం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంతరిక్షం రేపటి మన ఆర్థికం, భద్రత, ఇంధనం అని రాజ్‌నాథ్ అన్నారు. గగనయాన్ వంటి కీలక మిషన్ల కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
వైమానిక దళానిదే ఘనత: శుక్లా
భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ గురించి బాల్యంలో విని అంతరిక్ష ప్రయోగాల పట్ల ఆసక్తి పెరిగిందని శుక్లా చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకున్నానంటే ఆ ఘనత వైమానిక దళానిదేనన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిరావడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి అని వివరించారు.