ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్‌ రాణి | Hardoi Viral Video: UP Revolver Rani And Family Arrested | Sakshi
Sakshi News home page

Hardoi Video: ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్‌ రాణి.. వీడియో వైరల్‌

Jun 16 2025 4:22 PM | Updated on Jun 16 2025 4:37 PM

Hardoi Viral Video: UP Revolver Rani And Family Arrested

డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్‌ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్‌ హర్దోయ్‌లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇషాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్‌గ్రామ్‌ ఏరియాలోని ఓ సీఎన్‌జీ పెట్రోల్‌ పంప్‌ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్‌ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్‌ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. 

ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్‌. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు.  కూతురు సురుష్‌ఖాన్‌(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.

ఘటనపై బాధితుడు రజనీష్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్‌ రాణిని కూడా అరెస్ట్‌ చేశారు. రివాల్వర్‌తో పాటు 25 క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్‌ ఇషాన్‌ లైసెన్స్‌డ్‌ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది.

 

Advertisement
 
Advertisement
Advertisement