breaking news
Hardoi
-
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్‌లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్‌ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్‌తో పాటు 25 క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
గుడిసెపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి గుడిసెలో ఆదమరచి నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు హర్దోయ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.భల్లా కంజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. మెహందీఘాట్, కన్నౌజ్ నుంచి హర్దోయ్‌కు వెళ్తున్న ఇసుకతో కూడిన ట్రక్కు ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
‘మేం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ భార్య మృతి తట్టుకోలేక..
వివాహ సమయంలో పెద్దలు, వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులు.. చివరి మజిలీలో కూడా కలిసే ప్రయాణం చేశారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే తుదివరకు నడిచాడు ఆ భర్త.. రోడ్డు ప్రమాదంలో భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే.. ఆమె దూరమవ్వడాన్ని తట్టుకోలేక అతడు కూడా ప్రాణాలు విడిచిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.వివరాలు.. హర్దోయికి చెందిన యోగేష్ కుమార్‌కు(36) మణికర్ణిక కుమారి(28)కు ఆరేళ్ల కిత్రమే వివాహమైంది. యోగేష టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. కుమారి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఆసుపత్రికి వెళ్తుండగా సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-హర్దోయ్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో మణికర్ణిక మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది.ఆమె గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ సహాయంతో భర్తకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యోగేష్ తన భార్య వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య తనను వదిలి వెళ్లడం జీర్ణించుకోలేక మనోవేదనతో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా యోగేష్ సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యోగేష్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ‘మేమిద్దరం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ అని అందులో రాసి ఉంది. చదవండి: గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి -
సైకిల్‌ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు.. ఎంత అరిచినా..!
లఖ్‌నవూ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ విద్యార్థిని ఢీకొట్టిన కారు సుమారు కిలోమీటర్ ఈడ్చుకెళ్లింది. కారును ఆపాలని స్థానికులు ఎంత అరిచినా అలాగే వేగంగా దూసుకెళ్లాడు డ్రైవర్. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొత్వాలి నగర పరిధికి చెందిన కేతన్ అనే విద్యార్థి కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు సైకిల్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన క్రమంలో కారు వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో అతడి కాలు కారు వెనకాల బంపర్‌లో చిక్కుకుపోయింది. అలాగే సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్. కేతన్‌ను గమనించిన స్థానికులు కారును ఆపేందుకు పెద్దగా అరస్తూ వెంట పరిగెత్తారు. కిలోమీటర్ వెళ్లాక ఆపడంతో డ్రైవర్‌ను బయటకి లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడిని స్థానిక వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. #Hardoi में सड़क पर साइकिल सवार छात्र को घसीटते हुए ले गई कार @Manchh_Official pic.twitter.com/6jkBTuGkOS — पत्रकार Rishabh Kant (@KantChhabra) January 7, 2023 ఇదీ చదవండి: యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో ట్విస్ట్.. గొడవ పడ్డ అంజలి, నిధి -
కోతి చేష్టతో లబోదిబో: రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన వానరం
లక్నో: కోతి చేష్టలు అని ఊరికే అనరు. తాజాగా ఆ చేష్టలతో ఓ వ్యక్తి రూ.3 లక్షలు నష్టపోయాడు. నగదుతో కూడిన బ్యాగ్‌ను వానరం ఎత్తుకెళ్లడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఆశిష్‌సింగ్ అనే యువకుడు భూమి అమ్మగా వచ్చిన రూ.3 లక్షల డబ్బును ఓ బ్యాగ్‌లో పెట్టి బైక్ కవర్లో ఉంచాడు. అనంతరం లేక్పాల్ను కలిసేందుకు వచ్చాడు. సాండీ పోలీస్‌స్టేషన్ వద్ద బైక్‌ను నిలిపి లేక్పాల్ను కలిసేందుకు వెళ్లాడు. మాట్లాడి వచ్చి చూడగా బైక్ కవర్లో ఉన్న నగదుతో ఉన్న బ్యాగ్ కనిపించలేదు. కోతులు ఆ బ్యాగ్‌ను చిందరవందర చేశాయని గుర్తించాడు. కోతుల వెంట ఆశిష్ పరుగెత్తాడు. నగదు కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. లబోదిబో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు పిలుపునిచ్చాడు. చిందరవందరగా ఉన్న నగదును తీసుకొచ్చి ఆశిష్‌కు అందించాడు. తినే వస్తువులు కావడంతో కోతులు ఒకచోట పడేయగా వాటిని సెక్యూరిటీ గార్డు గమనించాడు. కిందపడిన నగదును నిజాయతీతో బాధితుడికి అందించాడు. పోయిన డబ్బులు తిరిగి రావడంతో ఆశిష్ ఆనంధానికి అవధులు లేవు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి కొంత నగదు కానుక అందించాడు. -
నా కొడుకు చచ్చి నెలైనా స్పందించరా? ఎమ్మెల్యే ఫైర్
లక్నో: ఆక్సిజన్ అందక తన కుమారుడు మృతి చెందాడని.. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులైనా చర్యలు తీసుకోలేరా అని అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం పోలీసులు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దియో జిల్లాలోని శాండిల్య నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ కుమారుడు అశిశ్ (35) ఏప్రిల్ 26వ తేదీన మృతి చెందారు. కకోరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆశిశ్‌ను చేర్చగా ఉదయం ఆక్సిజన్ 94 ఉండగా సాయంత్రానికి ఆక్సిజన్ స్థాయి తగ్గిందని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటి నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చి అందిస్తున్నట్లు చెప్పారని ఆ కొద్దిసేపటికి తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ముఖ్యమంత్రి, కలెక్టర్, డీజీపీ, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి తన కుమారుడి మరణానికి సంబంధించి కేసు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా బిడ్డ మరణానికి ఆస్పత్రిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. -
కూతురి తల నరికిన తండ్రి.. అందుకే చంపానంటూ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురినే అత్యంత పాశవింగా హతమార్చాడో తండ్రి. ఆపై తల నరికి, చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషనుకు బయల్దేరాడు. ఈ ఘటన హర్దోయి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. పండేతారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తికి పదిహేడేళ్ల కూతురు ఉంది. కాగా గత కొన్ని రోజులుగా ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సర్వేశ్ కోపంతో రగిలిపోయాడు. ప్రతిష్టకు మచ్చ తెచ్చే పని చేసిందంటూ పదునైన ఆయుధంతో ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, బాటసారులు విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా..‘‘నేనే చేశాను. ఇందులో వేరే ఎవరికీ ప్రమేయం లేదు. తలుపులు గడియపెట్టి తనను నరికాను. ఆ తర్వాత మొండాన్ని అక్కడే పడేసి తల స్టేషనుకు తీసుకువస్తున్నా’’అంటూ ఏమాత్రం బెదురు లేకుండా సమాధానమిచ్చాడు. ఆ సమయంలో అతడిలో పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సర్వేశ్‌ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పులు