‘మేం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ భార్య మృతి తట్టుకోలేక.. | Wife Dies In Accident Husband Dies By Suicide A Day Later Leaves Note | Sakshi
Sakshi News home page

‘మేం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ భార్య మృతి తట్టుకోలేక..

Published Thu, Apr 25 2024 3:43 PM | Last Updated on Thu, Apr 25 2024 3:43 PM

Wife Dies In Accident Husband Dies By Suicide A Day Later Leaves Note - Sakshi

వివాహ సమయంలో పెద్దలు, వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులు.. చివరి మజిలీలో కూడా కలిసే ప్రయాణం చేశారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే తుదివరకు నడిచాడు ఆ భర్త..  రోడ్డు ప్రమాదంలో భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే.. ఆమె దూరమవ్వడాన్ని తట్టుకోలేక అతడు కూడా ప్రాణాలు విడిచిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

వివరాలు.. హర్దోయికి చెందిన యోగేష్‌ కుమార్‌కు(36) మణికర్ణిక కుమారి(28)కు ఆరేళ్ల కిత్రమే వివాహమైంది. యోగేష​ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. కుమారి హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుంది.  అయితే ఎప్పటిలాగే ఆసుపత్రికి వెళ్తుండగా సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-హర్దోయ్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో మణికర్ణిక మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది.

ఆమె గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ సహాయంతో  భర్తకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యోగేష్‌ తన భార్య వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య తనను వదిలి వెళ్లడం జీర్ణించుకోలేక మనోవేదనతో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా యోగేష్ సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యోగేష్‌ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ‘మేమిద్దరం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ అని అందులో రాసి ఉంది. 
చదవండి: గన్‌ మిస్‌ఫైర్‌.. డీఎస్పీ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement