గన్‌ మిస్‌ఫైర్‌.. డీఎస్పీ మృతి | Dsp Sheshagiri Died In Gun Misfire At Badradri Kothgudem Crpf Camp | Sakshi
Sakshi News home page

తుపాకీ మిస్‌ఫైర్‌.. ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లి డీఎస్పీ మృతి

Apr 25 2024 6:05 PM | Updated on Apr 25 2024 6:05 PM

Dsp Sheshagiri Died In Gun Misfire At Badradri Kothgudem Crpf Camp - Sakshi

సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్‌ క్యాంపులో గన్‌ మిస్‌ఫైర్‌ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్‌24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్‌ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. 

ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement