కోతి చేష్టతో లబోదిబో: రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన వానరం

Monkey Ran With Cash Bag In Uttar Pradesh - Sakshi

లక్నో: కోతి చేష్టలు అని ఊరికే అనరు. తాజాగా ఆ చేష్టలతో ఓ వ్యక్తి రూ.3 లక్షలు నష్టపోయాడు. నగదుతో కూడిన బ్యాగ్‌ను వానరం ఎత్తుకెళ్లడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఆశిష్‌సింగ్‌ అనే యువకుడు భూమి అమ్మగా వచ్చిన రూ.3 లక్షల డబ్బును ఓ బ్యాగ్‌లో పెట్టి బైక్‌ కవర్‌లో ఉంచాడు. అనంతరం లేక్‌పాల్‌ను కలిసేందుకు వచ్చాడు. సాండీ పోలీస్‌స్టేషన్‌ వద్ద బైక్‌ను నిలిపి లేక్‌పాల్‌ను కలిసేందుకు వెళ్లాడు. మాట్లాడి వచ్చి చూడగా బైక్‌ కవర్‌లో ఉన్న నగదుతో ఉన్న బ్యాగ్‌ కనిపించలేదు. కోతులు ఆ బ్యాగ్‌ను చిందరవందర చేశాయని గుర్తించాడు.

కోతుల వెంట ఆశిష్‌ పరుగెత్తాడు. నగదు కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. లబోదిబో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు పిలుపునిచ్చాడు. చిందరవందరగా ఉన్న నగదును తీసుకొచ్చి ఆశిష్‌కు అందించాడు. తినే వస్తువులు కావడంతో కోతులు ఒకచోట పడేయగా వాటిని సెక్యూరిటీ గార్డు గమనించాడు. కిందపడిన నగదును నిజాయతీతో బాధితుడికి అందించాడు. పోయిన డబ్బులు తిరిగి రావడంతో ఆశిష్‌ ఆనంధానికి అవధులు లేవు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి కొంత నగదు కానుక అందించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top