
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.
ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్‌పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.
2018లో శివాని, ప్రమోద్‌ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.
ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.
ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి..