
లక్నో: భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది(Ayodhya Blast). ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయోధ్య సమీంలోని పగ్లాభారీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోగా.. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని.. శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
अयोध्या के पुरा कलंदर में एक ज़ोरदार ब्लास्ट से एक मकान ढह गया। राम कुमार के परिवार के 5 लोगों की दर्दनाक मौत हो गई। कहा जा रहा है अवैध पटाखे बन रहे थे या सिलेंडर ब्लास्ट हुआ जांच में साफ होगा।#Ayodhya@ayodhya_police pic.twitter.com/2BX9IRqAhp
— Hussain Rizvi हुसैन حسین رضوی (@TheHussainRizvi) October 10, 2025
గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెజర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే.. పేలుడు జరిగిన చోట గన్‌పౌడర్, పటాకుల మిగులు భాగాలు బయటపడ్డాయి. దీంతో అనుమతులు లేకుండా బాణాసంచాలు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి యాజమానిని రామ్‌కుమార్ కసౌధన్ అలియాస్ పప్పు గుప్తాగా పోలీసులు నిర్ధారించారు. ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే ఇంట్లో పేలుడు జరిగి యజమాని భార్య, తల్లి మరణించినట్లు సమాచారం.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు(CM Yogi on Ayodhya Blast). ఘటనపై త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. దీంతో క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. మొన్నే కాన్పూర్‌లో స్కూటర్ పేలుడు సంభవించి(Kanpur Scooter Blast).. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొలుత బాణాసంచాల వల్లే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు.. అది సిలిండర్ బ్లాస్ట్ అని తాజాగా ప్రకటించారు. ఈ రెండు పేలుళ్లపై కుట్ర కోణం ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని ఖండించారు.
ఇదీ చదవండి: శబరిమలై వ్యవహారంలో మరో ట్విస్ట్