ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం | Delhi-Agra Expressway Tragic Crash Incident In Mathura On Dec 16th Live News Updates, Buses And Cars Catch Fire | Sakshi
Sakshi News home page

వీడియో: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం

Dec 16 2025 6:34 AM | Updated on Dec 16 2025 9:05 AM

Delhi  Agra High Way Inident Dec 16th News Live Updates

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా.. పలు కార్లు, బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 25 మందికి గాయాలయ్యాయి.  

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. 

ప్రత్యక్ష సాక్షులు, మథుర ఎస్‌ఎస్‌పీ శ్లోక్‌ కుమార్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘యమునా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైల్‌ స్టోన్‌ వద్ద  ఏడు బస్సులు, మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఫైర్‌ బృందాలు రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి. 

ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను గుర్తించగలిగాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరిన వాళ్ళ పరిస్థితి విషమంగా ఏం లేదు’’ అని అన్నారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుగ మూడు కార్లు మరొకటి ఢీ కొట్టాయి. అనంతరం ఆ వెనకాలే ఏడు బస్సులు ప్రమాదానికి గురై మంటలు అంటుకున్నాయి. అలా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పలువురు ఫోన్‌లలో తీసిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

 

 👉ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే (యమునా ఎక్స్‌ప్రెస్‌వే) పొడవు 165.5 కిలోమీటర్లు. 2012 ఆగస్టు 9న ప్రారంభించబడింది. ఇది గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు విస్తరించి, ఆరు లేన్లతో నిర్మించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం పాత ఢిల్లీ–ఆగ్రా జాతీయ రహదారి (NH-2)లోని ట్రాఫిక్‌ను తగ్గించడం. 

👉ఈ హైవే గ్రేటర్ నోయిడా, జేవర్, వృందావన్, మథుర, హత్రాస్ వంటి పట్టణాలను కలుపుతూ ఆగ్రాకు చేరుస్తుంది. భారతదేశంలో ఆరో పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తించబడింది. అయితే.. అధిక వేగం, డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం, పొగమంచు కారణంగా తరచూ ఈ హైవేపై ప్రమాదాలు జరుగుతుంటాయి. 

👉2012–2023 మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడం వల్ల జరిగాయి!. ఎక్స్‌ప్రెస్‌వే పొడవుగా, సూటిగా ఉండటం వల్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. అందుకే ఇటీవలే వేగ పరిమితిని 75 kmphకి తగ్గించారు. తాజా ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement