breaking news
Express high way
-
Hyderabad: ఇదేం ట్రెండ్రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్ చేసిన జంట
హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది. శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ వేపై ఓ కియా కారు శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
రోడ్లపై యుద్ధ విమానాలు.. గ్రాండ్ సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ మార్షల్ వైస్ చీఫ్ ఎస్బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు
-
రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు
♦ రాజధాని రైతుల రుణాల మాఫీపై సీఎం ♦ రూ.లక్షన్నర రుణాన్ని మాఫీ చేశాం.. అంతే ♦ అంతకుమించి రైతులకు అత్యాశ పనికిరాదు ♦ మా భూమి ఇక్కడే ఉంది... ఇక్కడే ఉంటామంటే ఎలా? ♦ ఆధునీకరణలో భాగంగా ఈ ఊర్లన్నీ మారతాయి ♦ అమరావతిలో విద్యుత్‌తో వాహనాలు నడిచే వ్యవస్థ ♦ వ్యవసాయానికి కార్పొరేట్ భాగస్వామ్యం ♦ 25 నుంచి 30 పంటలకు మార్చి ఒకటి నుంచి అమలు సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘రాజధాని రైతుల రుణాలన్నీ రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాం? నీకు ఒక్కడికే కల్లోకి వచ్చి చెప్పానా? నీలాంటి వాళ్లు ఒకరిద్దరుంటే అంతా నాశనం అవుతుంది. రూ.లక్షన్నర రుణాన్ని వన్‌టైమ్ సెటిల్మెంట్గా మాఫీ చేస్తామని చెప్పాం, ఆ మేరకు చేశాం. నేను చేస్తానన్న రుణమాఫీ చేసేశా... అంతే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఆయన తన దావోస్ సదస్సు అనుభవాలు వివరించేందుకు సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయనే హామీ అమలు కాలేదని ఒక విలేకరి ఈ సందర్భంగా ప్రశ్నించడంతో చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని నీకు ఒక్కడికే కల్లోకి వచ్చి చెప్పానా? అంటూ ఎగతాళి చేశారు. విచ్చలవిడిగా రాస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. తాను చేస్తానన్న రుణమాఫీ చేసేశానని, రైతులకు అత్యాశ పనికిరాదని వ్యాఖ్యానించారు. సీఎం మాటలతో విలేకరులు అవాక్కయ్యారు. ఎన్నికల ముందు రాష్ర్టంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ఊరూరా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ నెరవేర్చకపోగా ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులకు కూడా మొండిచేయి చూపించడంతో విలేకరుల నోట మాట రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. మా భూమి ఇక్కడే ఉంది మేం ఇక్కడే ఉంటామంటే ఎలా కుదురుతుందని రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి ప్రశ్నించారు. రోడ్లు, ప్రాజెక్టులు మా ఊరి పక్కనే ఉండాలి, కానీ మా ఊళ్లోకి రాకూడదంటే ఎలా? అని అడిగారు. ఆధునీకరణలో భాగంగా ఈ ఊర్లన్నీ మారతాయని స్పష్టంచేశారు. సీఆర్డీఏ రీజియన్‌లో వ్యవసాయ జోన్లపై జరుగుతున్న ఆందోళన గురించి విలేకరులు ప్రస్తావించగా... భూమిని ఇవ్వడానికి ముందుకురాని రైతులు అగ్రి జోన్ పెడితే వద్దంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాజెక్టు దెబ్బతింటే మొదట రైతులు, ఆ తర్వాత రాష్ట్రం నష్టపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నాది విలాస పర్యటన కాదు.. దావోస్ విలాస పర్యటన కాదని, ఏపీని ప్రమోట్ చేసే పర్యటనని సీఎంచెప్పారు. సదస్సులో సోలార్ సెల్స్ సామర్థ్యం ఇంకా పెరగాలనే అభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో వాహనాలన్నీ విద్యుత్‌తో నడిచే వ్యవస్థను తీసుకొస్తామని, తొలి దశలో అమరావతి నగరంలో దీన్ని ప్రవేశపెట్టే యోచన ఉందని తెలిపారు. తాను 16 దేశాలకు చెందిన 58 మందితో సమావేశమయ్యాయని, 38 కంపెనీల సీఈఓలతో విడిగా భేటీ అయ్యాయని తెలిపారు. ప్రపంచమంతా గుర్తించేలా ఏపీని ప్రమోట్ చేశామన్నారు. రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ ఇచ్చిన ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులున్నాయని అంగీకరించారు. అందుకే కొత్త ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చంద్రబాబుకు ఆదర్శ సీఎం పురస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 30న పూణెలో జరిగే ఆరో ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయంలోనూ కార్పొరేట్ భాగస్వామ్యం వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 25 నుంచి 30 పంటలను ఎంపిక చేసి విత్తు నాటే దగ్గర నుంచి చేతికొచ్చి అమ్ముకునేవరకూ అన్ని పనుల్నీ కార్పొరేట్ పద్ధతిలో చేయించే ఈ విధానాన్ని.. మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. దావోస్‌లో జరిగిన ఒక సదస్సులో ‘న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్’ అనే అంశంపై చర్చ జరిగిందని, దాన్ని ఇక్కడ అమలు చేయనున్నామని తెలిపారు.