హైవేలపై యుద్ధ విమానాల ల్యాండింగ్‌.. విజయవంతం

Air Force Fights Successfully Landed on Highways

సాక్షి, న్యూఢిల్లీ : లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. 

యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. 

భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్‌-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్ మార్షల్‌ వైస్‌ చీఫ్ ఎస్‌బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top