ప్రియురాలే గెలిచింది | Lover Cheating Incident At Raichur | Sakshi
Sakshi News home page

ప్రియురాలే గెలిచింది

Dec 16 2025 7:20 AM | Updated on Dec 16 2025 7:22 AM

Lover Cheating Incident At Raichur

కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్‌కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్‌ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్‌ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. 

ఆమె గర్భం దాల్చగా అబార్షన్‌ చేయించి, మళ్లీ  ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement