ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి, లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్‌లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వివాహ వేడుకకు విచ్చేసి.. నూతన వధూవరులు ప్రణయచంద్రారెడ్డి, జానకి ప్రియను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. – గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం)
కంటి‘పాప’ భావోద్వేగం
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాలులో గురువారం వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.


