
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(బుధవారం) భీమవరంలో పర్యటించారు. విఎస్‌ఎస్ గార్డెన్స్‌లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.
