breaking news
Bhimavaram
-
LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్
-
భీమవరం టూర్ గ్రాండ్ సక్సెస్
-
భీమవరం.. బ్రహ్మరథం
సాక్షి, భీమవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం భీమవరం జనసంద్రంగా మారింది. పట్టణంలో రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలనే కోరికతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలి వచ్చారు. అడుగడుగునా జనం నిరాజనం పట్టారు. జగన్ కాన్వాయి ప్రయాణించే దారి మొత్తం జనంతో నిండిపోయింది. కేవలం ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణానికి గంటకుపైనే సమయం పట్టింది. రాష్ట్రంలోనే భీమవరం ఆక్వా హబ్‌గా పేరొందింది. కూటమి పాలనలో సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు అదునుచూసి ఇష్టానుసారం మేత రేట్లు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని కాజేస్తున్నాయి. ఈ దోపిడీని అడ్డుకోవాలని మూడు నెలలుగా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతుల కోసం జగన్ బుధవారం భీమవరం రావడం రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. భీమవరం లూథరన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఉండి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలోని సభా ప్రాంగణం వరకు రోడ్డు ఇసుకవేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. తాలుకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్లు జనసంద్రాన్ని తలపించాయి. దారి పొడవునా తన కోసం వేచి ఉన్న వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సదస్సులో చంద్రబాబు ప్రభుత్వ తీరును ఏకిపారేస్తున్నప్పుడు పెద్ద పెట్టున యువత ఈలలు, కేకలు వేశారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంజెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యం రోప్ పార్టీ ఉన్నా జనాన్ని నిలువరించలేక తోపులాట వలంటీర్లుగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫలితంగా ఆక్వా సదస్సు విజయవంతం భీమవరం: ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బు«ధవారం భీమవరంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశం భద్రత ఏర్పాట్లలో ప్రభుత్వం.. పోలీసు శాఖ ఘోరంగా విఫమైందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పోటెత్తారు. ఇలా భారీగా తరలి వస్తారని ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉన్నా, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఫలితంగా హెలిప్యాడ్, సభా వేదిక వద్ద రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. భీమవరం పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా గరగపర్రురోడ్డులోని రైల్వే అండర్‌పాస్ నుంచి బీవీరాజు కూడలి మీదుగా బైపాస్ రోడ్డులోని సభాస్థలి వరకు జగన్ కారులో వెళతారని ఆయన్ను కళ్లారా చూడాలని దారి పొడవున పెద్ద సంఖ్యలో జనం వేచి చూశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిన దాఖలాలు కన్పించలేదు. కనీసం జగన్ వేదిక వద్దకు వచ్చే సమయంలో జనం తోసుకువస్తున్నా రోప్ పార్టీ, తగినంత మంది పోలీసులు లేనందున నిలువరించలేకపోయారు. దీంతో వైఎస్ జగన్ ముందుకు పడబోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తమై పట్టుకున్నారు. వేదిక ముందు రైతులు, ప్రజల కోసం ఏర్పాట్లు చేసినా పోలీసుల భద్రత వైఫల్యం కారణంగా తోపులాట చోటుచేసుకుంది. అయితే వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆక్వా సదస్సు విజయవంతమైంది. -
ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్ జగన్ భీమవరం పర్యటన (ఫొటోలు)
-
ఇది ట్రైలర్ మాత్రమే.. దద్దరిల్లిన భీమవరం...
-
YS Jagan: నువ్వు మారుతావా.. నన్ను మార్చమంటావా..?
-
వెళ్తూ వెళ్తూ చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
ఫ్యాన్స్ రియాక్షన్.. ఢిల్లీ వాళ్ల వల్లే కాలేదు గల్లీ గాళ్లు మీరేంది రా..
-
చంద్రబాబు ఇది నీకు ట్రైలర్ మాత్రమే! జగన్ స్పీచ్ దద్దరిల్లిన భీమవరం
-
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్‌లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్‌పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్‌కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్‌కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
Live: ఆక్వా రైతులతో YS జగన్ ముఖాముఖి
-
భీమవరం జగన్ ర్యాలీలో ప్రభాస్ ఫోటో
-
జగన్ కు ఘన స్వాగతం పలికిన భీమవరం ప్రజలు
-
జగన్ రాకతో దద్దరిల్లిన భీమవరం
-
జగన్ హయాంలో ఆక్వా రైతులకు భరోసా
సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వంలో కుదేలైన ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలారు. ఫీడ్ రేట్లు, పెట్టుబడి వ్యయం పెరగడంతో విలవిలాడుతున్న ఆక్వా రైతన్నలకు భరోసా కల్పించేందుకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు. చంద్రబాబు నిర్వాకంతో నైరాశ్యంలో మునిగిపోయిన ఆక్వారైతుల కష్టాలను స్వయంగా వినేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు భీమవరానికి విచ్చేశారు జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు చేసిన మేలును ఈ సందర్భంగా ఆక్వారైతులు గుర్తు చేసుకుంటున్నారు.రైతన్నలకు పూర్తి అండదడలువైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకు పూర్తి అండదడలు అందించారు. చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు నిర్ణయాలు అమలు చేశారు. విద్యుత్, రొయ్యల మేతకు సబ్సిడీ ఇచ్చి మేలు చేశారు. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే యూనిట్ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. దీంతో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ మేలు జరిగింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్‌లకు సబ్సిడీ విద్యుత్‌ను సరఫరా చేశారు. 84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు.15 రోజులకు ఒకసారి ధరల సమీక్షపాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్ట్‌లను తెచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ కృషి చేశారు.కూటమి ప్రభుత్వం వెన్నుపోటుఆక్వా రైతులకు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కాలరాసింది. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ అందిస్తామన్న హామీని అటకెక్కించింది. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లకు ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తోంది. మరోవైపు రొయ్యల మేత ధరలను అదుపు చేయంలోనూ విఫలమైంది. ఫలితంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమను ఆదుకోవాలను ఎన్నిసార్లు ఆక్వారైతులు వేడుకున్నా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. దీంతో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. -
భీమవరం బయలుదేరిన జగన్
-
Watch Live: భీమవరానికి వైఎస్ జగన్
-
చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భీమవరం పర్యటనకు సంబంధించి... -
భీమవరం ఆక్వా రైతులను పరామర్శించనున్న YS జగన్..
-
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలవనున్నారు. ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్ చార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇందుకోసం వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు. అనంతరం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తారు. -
నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను నేరుగా వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. విశాఖ పర్యటన షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.రేపు భీమవరానికి వైఎస్ జగన్ ఆక్వా రైతులకు పరామర్శసాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం వెళుతున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో ఆయన ముఖాముఖి చర్చిస్తారు. రైతుల సమస్యలను, నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్... ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. -
చలో భీమవరం.. జగన్ పర్యటనపై సమావేశం
-
రైతుల కోసం అవసరమైతే రైలులోనైనా వస్తారు జగన్: పేర్ని నాని
సాక్షి, ఏలూరు: ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న భీమవరం పర్యటనను.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు నిరాకరించినా.. అవసరమైతే జగన్ రైలులో అయినా వచ్చి రైతులను కలుస్తారని పేర్కొన్నారు.శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఆక్వా మేత ధరలు భారీగా పెరిగినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మేత కంపెనీలు, పాలకులు కుమ్మక్కై రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జూలై 15న వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటన ఖాయమైందని ఆయన వెల్లడించారు. పర్యటనను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు ఇవ్వకపోయినా, ఇతర ఆంక్షలు విధించినా జగన్ వెనక్కి తగ్గరని, అవసరమైతే రైలులో ప్రయాణించి అయినా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ పర్యటనతో ఆక్వా రైతుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారనున్నాయని, ప్రభుత్వం రైతుల డిమాండ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
భీమవరంలో సినీనటి కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన
-
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భీమవరం బుల్స్ తొలిసారి విజేతగా అవతరించింది. 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ సాధించింది. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా నిన్న జరిగిన టైటిల్ సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టు తరఫున త్రిపురణ విజయ్ (39 నాటౌట్) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా ప్లేయర్లలో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును తాకలేకపోయారు. నిమ్మల హిమకర్ 17, రికీ భుయ్ 9, హనీశ్ రెడ్డి 15, మహీప్ కుమార్ , బోదల వినయ్ 19, గిరినాథ్ రెడ్డి 6, ధనుశ్ మార్తల 4, రోషన్ కమార్ 0, కమ్రుద్దీన్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. భీమవరం బౌలర్లలో చెన్నుపాటి రవితేజ (3-0-22-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రవికిరణ్, యశ్వంత్, హమంత్ రెడ్డి, తోట శ్రవణ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బుల్స్ ఓపెనర్లు హేమంత్ రెడ్డి (59 నాటౌట్), రేవంత్ రెడ్డి (71 నాటౌట్) ఇద్దరూ కలిసి సునాయాసంగా ఊదేశారు. వీరి దెబ్బకు ఆ జట్టు కేవలం 9 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. -
మైనర్ బాలిక అత్యాచారం కేసు.. పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
జనసేన సేత రాసలీలల కేసు.. పోలీసుల నిర్లక్ష్యం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన సేత రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడింది. జనసేన నేత జయప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో బాధితురాలిగా అండగా నిలవాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ నాయకులకు కొమ్ముకాస్తున్న వైనం కొట్టొచ్చినట్లు కనబడింది. రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలు ఉన్నా జయప్రకాశ్‌పై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితురాలని నాలుగు గంటల పాటు స్టేషన్లోనే ఉంచారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జనసేన నేతపై కేసు నమోదు చేయకుండా ఉండటమే కాకుండా, చివరకు బాధితురాలని నాలుగు గంటలపైగా స్టేషన్లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధితులకి న్యాయం జరగకపోవడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. -
‘శ్రీవారి భక్తులకు చంద్రబాబు,పవన్ క్షమాపణలు చెప్పాలి’
భీమవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరంలో వైయస్సార్సీపీ నాయకులు చినిమిల్లి వెంకట రాయుడు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్‌తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనే కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖలో 1.86 లక్షల టన్నుల మాంసాన్ని అక్రమంగా నిల్వ చేస్తే ఆరోజు పట్టించుకోని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిజం చెబుతుంటే మాపై దాడులులడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నాయకులంతా ముక్కు నేలకు రాసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలేశుడిని వివాదాల్లోకి లాగడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచనలను దృష్టి మళ్లించడం కోసం పదే పదే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠవాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బయటపెట్టి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వరుస పెట్టి దాడులకు దిగుతున్నారు.జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసిందికల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారంటూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్న నెయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలోకి ప్రవేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నా కూడా వైయస్సార్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసం కాదు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు సహా ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతైనా దుష్ప్రచారం ఆపడం లేదు. బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిపారంటూ చంద్రబాబు కొత్త ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి. చంద్రబాబు ప్రచారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హయాంలోనే అనుమతులు లభించాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసే కుట్రపాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కనిపించకుండా చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం స్కూళ్లలో చదివే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోతున్నారు. రెండేళ్లు కూడా గడవకుండానే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పుడు ప్రచారానికి గాను ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆలయ మెట్లు ఇప్పుడైనా సవ్యంగా పైనుంచి కిందకు కడగాలి. దేవుడి మీద నమ్మకం లేదని, దేవుడిని ఉరి తీయాలని చెప్పిన నాగబాబు సైతం సనాతన ధర్మం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అవకాశవాద రాజకీయాలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. సీబీఐ సిట్ చార్జిషీట్లో మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్‌ల పేర్లు లేకపోయినా వారి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మాటలతో హిందువుల మనోభావాలను గాయపరచడం సరికాదు.గోవధపై మీరెందుకు మాట్లాడటం లేదు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారే అయితే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా (శ్లాటర్ హౌస్)ను తక్షణం మూసేయించాలి. ఇళ్ల మధ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్న జంతు వధ కారణంగా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న జంతు వధను ఆపేలా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాటర్ హౌస్‌పై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కి దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. విశాఖలో 1.85 లక్షల టన్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచరిదని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎందుకు స్పందించలేదు? 12 వేల గోవులను చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే పట్టించుకోని ఈ కేంద్ర మంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసినా ఇప్పటికీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. దేవుడి మీద భయం, భక్తి ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? కేంద్ర తనిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాదని తేలింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
సాక్షి,పశ్చిమగోదావరి: శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పెదఅమిరం శ్రీరాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వైఎస్ జగన్.. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. -
నేడు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
-
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
నా తల్లి, తమ్ముడు దెయ్యాలు.. అందుకే చంపేశా..!
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తల్లి, సోదరుడిని చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. సోమవారం తెల్లవారుజామున గునుపూటి మహాలక్ష్మి (60), గునుపూటి రవితేజ(33) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోయడానికి ఉపయోగించే చాకుతో నిందితుడు గునుపూటి శ్రీనివాస్ వారిని కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఒకటో పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి, పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు రవితేజతో కలిసి నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. మృతురాలి భర్త కోవిడ్ సమయంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పెద్ద కొడుకు శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడని, అప్పుడప్పుడూ మాత్రమే బయటకు వస్తుంటాడని చెబుతున్నారు. శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసి.. 112కు ఫోన్ హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ నేరుగా డయల్ 112కు ఫోన్ చేసి హత్య వివరాలు తెలిపాడు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా.. వారిద్దరినీ తానే చంపానని, వాళ్లు దెయ్యాలని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో తనను బంధించారని, తన మనసులో ఏం మాట్లాడుకుంటున్నా అది వాళ్లిద్దరికీ తెలిసిపోతోందని, ఎంత పొడిచినా వాళ్లిద్దరూ రక్తపు మడుగులో కొట్టుకోవడం చూస్తే బతికి వచ్చి మళ్లీ తనను ఇబ్బంది పెట్టేలా ఉన్నారని చెప్పాడు. అతని మాట తీరు, చెప్పిన సమాధానాలను బట్టి అతనికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
కార్తీకమాసంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
కోడికి పందెం పాఠాలు
పుంజులకు పందెం పాఠాలేంటీ అనుకుంటున్నారా? సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎంత ఫేమస్సో తెలిసిందే. రూ.కోట్లలో చేతులు మారడం ఒకెత్తయితే.. తమ కోడి.. పందెం కొట్టడం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో ఎత్తు. పుంజులను పందేలకు సిద్ధం చేసేందుకు మూడు నెలల ముందు నుంచి పెద్ద కసరత్తే జరుగుతుంది. రానున్న సంక్రాంతి కోసం దసరా నుంచే పందెంరాయుళ్లు తమ పుంజులకు శిక్షణ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ రోజుల్లో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టే పుంజుల పెంపకంలో పందేలరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అధిక శాతం మంది తమ ఇళ్లు, మకాంల వద్ద పుంజులను పెంచితే.. పండుగలకు దేశ విదేశాల నుంచి వచ్చేవారు తెలిసిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తుంటారు. -సాక్షి, భీమవరంమెనూ ప్రత్యేకమే..పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యరి్థపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి రాగులు, గంటులు, అరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మరెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు. అంతా గోప్యమే కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయస్సు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తుంటారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తారు. శిక్షణ మొదలవుతుందిలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లలో పటుత్వం, ఆయాసం రాకుండా, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు నెలరోజుల పాటు రోజు విడిచి రోజు చెరువులు, నీటి తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. ‘వి’ (ఇంగ్లిష్ లెటర్) ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ పరుగులు పెట్టిస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తుంటారు. పండుగలు దగ్గరపడే కొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులు తగ్గడానికి ప్రత్యేక ట్రైనర్లతో వేప, జామాయిల్, కుంకుడు తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాలతో గంటల కొద్దీ మరిగించిన ద్రావణాన్ని కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చి పుంజును అందులో ఉంచి పైనుంచి ద్రావణం పోస్తారు. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తారు. చివరిగా పొయ్యిపై మూకుడు వేడిచేస్తూ అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దానిని కోడి శరీరం అంతా అద్దుతూ శాఖల చేయిస్తారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతినిచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. ఈ ప్రక్రియలన్నిటినీ నిర్ణీత పద్ధతుల్లో చేయిస్తుంటారు. కోట్లలో వ్యాపారం.. మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలుంటాయి. వీరు ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్ల పోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లకు సిట్టింగ్‌కు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందంటున్నారు. వీటి జాతి, రంగు, ఎత్తును బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తుంటారు. పండుగల కోసం నాలుగు వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పుంజులకు ఉన్న డిమాండ్‌తో జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. కొందరు స్థలాలను లీజుకు తీసుకుని వీటి పెంపకం సాగిస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కోచోట వంద నుంచి 250 వరకు వివిధ రకాల జాతుల పుంజులు, కోళ్లను పెంచుతుంటారు. -
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.ఆదర్శనీయుడు వాల్మీకి మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్‌కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్‌లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్‌కు ఏపీ కెపె్టన్‌గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్‌లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్‌గా ఉన్నాను. అక్కడి సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్‌గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్‌లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్‌లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్‌గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్‌లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్‌మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
వర్షంలోనూ తగ్గని అభిమానం
-
Bhimavaram: వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(బుధవారం) భీమవరంలో పర్యటించారు. విఎస్ఎస్ గార్డెన్స్‌లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. -
నేడు భీమవరంలో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ విఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
'ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్'.. హీరోయిన్ క్లారిటీ
ఏపీ ప్రభుత్వ వాహనంలో తాను ఈవెంట్‌కు వెళ్లడంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. ఈ వాహనాన్ని కావాలని తాను అడగలేదని తన నోట్లో రాసుకొచ్చింది. ఈవెంట్ నిర్వాహకులు ఆ కారును తన కోసం పంపారని ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేసింది. ప్రభుత్వ వాహనం ఏర్పాటులో తన ప్రమేయం ఏమాత్రం లేదని నిధి అగర్వాల్ తెలిపింది.కాగా.. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన నిధి అగర్వాల్.. ప్రభుత్వ వాహనంలో వెళ్తూ కనిపించింది. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఇందులో నిధి పాత్ర లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ వాహనం ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనెజర్స్ ఏర్పాటు చేయడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వద్ద ప్రభుత్వ వాహనం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాహనాలను ఏకంగా రెంట్‌కి ఇచ్చారా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ ఇటీవలే పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో హీరోయిన్గా నటించింది.pic.twitter.com/wa063DafKo— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025 -
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో "భీమవరం బుల్స్" ఫ్రాంచైజీ సారధిగా నియమించబడ్డాడు. ఈ మేరకు సదరు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ముగిసిన వేలంలో భీమవరం బుల్స్ నితీశ్‌ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న నితీశ్.. పర్యటన ముగియంగానే బుల్స్‌తో జతకడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో ఎడిషన్ ఆగప్ట్ 8న మొదలుకానుంది. అదే నెల 24న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖలోని Dr.YSR ACA-VDCA స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్లో ఏపీఎల్ ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగుతుంది. గతంలో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు తెరమరుగయ్యాయి.భీమవరం బుల్స్ ఫుల్ స్క్వాడ్నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, మునీష్ వర్మ, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, ఎం యువన్, బి సాత్విక్, కె రేవంత్ రెడ్డి, సాయి సూర్య తేజ రెడ్డి, సిహెచ్ శివ, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భువనేశ్వర్ రావు, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తాహనుమ విహారీ, కేఎస్ భరత్ కూడా..!ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు కూడా వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తారు. భారత టెస్ట్ క్రికెటర్లు హనుమ విహారీ అమరావతి రాయల్స్‌కు, కేఎస్ భరత్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తారు.మిగిలిన నాలుగు జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్‌కు వరుసగా షేక్ రషీద్, రికీ భుయ్, మహదీప్, అశ్విన్ హెబ్బర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.కాగా, జులై 14న జరిగిన APL 2025 వేలం మొత్తం 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆల్ రౌండర్ పైలా అవినాష్ ఈ వేలంలో అత్యధికంగా రూ. 11.5 లక్షల బిడ్‌ను సంపాదించాడు.తదుపరి రెండు ఖరీదైన బిడ్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమకు చెందిన పి. గిరినాథ్ రెడ్డి (రూ. 10.05 లక్షలు), భీమవరం బుల్స్ ఆల్ రౌండర్ సత్యనారాయణ రాజుకు (రూ. 9.8 లక్షలు) దక్కాయి. -
Bhimavaram: శాకంబరీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన భీమవరం మావూళ్లమ్మ అమ్మవారు
-
భీమవరంలో మద్యం, గంజాయి మత్తులో యువకుల వీరంగం
-
మద్యం మత్తులో యువతి హల్ చల్
-
ఉప్పుటేరు.. ఊపిరి పోసేదెవరు?
ఉప్పుటేరు ..కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్. కానీ దీని నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యవసానం.. ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం. నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఏడాదైనా ఉప్పుటేరు ప్రక్షాళన జరుగుతుందనుకుంటే క్లోజర్ పనుల్లో దాని ఊసే విస్మరించారు. జిల్లాలోని డ్రెయిన్లలో పూడిక తీత, గుర్రపు డెక్క తొలగింపునకు రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, వాటిలో ఉప్పుటేరు ప్రస్తావనే లేదు. దీంతో ఉప్పుటేరుకు ఊపిరిపోసే ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందో అని కర్షకులు కలత చెందుతున్నారు. – సాక్షి, భీమవరంవ్యర్థాల మేటకు చిరునామా.. ఉప్పుటేరుఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 62 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. కొల్లేరుతో పాటు రెండు జిల్లాల పరిధిలోని మొగదిండి, న్యూ యనమదుర్రు, బొండాడ, పొలిమేర తిప్ప, పాత యనమదుర్రు మొదలైన ప్రాంతాల్లో 120 వరకు మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు ఉప్పుటేరులో కలుస్తాయి. వీటి ద్వారా గుర్రపు డెక్క, తూడు, వ్యర్థాలు ఉప్పుటేరులోకి చేరి పూడికతో నిండిపోతోంది. ఆకివీడు, లోసరి, దొంగపిండి, పాతపాడు, మాలవానితిప్ప, మోరి గ్రామాల్లో డ్రెయిన్ పూడుకుపోయి మేటలు వేసింది. వైఎస్సార్ హయాంలో శ్రీకారంఉప్పుటేరును అభివృద్ధి చేయాలన్న రైతుల విజ్ఞప్తికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. పూడిక తొలగింపునకు ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్అండ్బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తి చేశారు. అనంతరం పనులు వాయిదా పడ్డాయి.జగన్ హయాంలో రూ.412 కోట్ల కేటాయింపులుస్వచ్ఛ కొల్లేరు దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.412 కోట్ల కేటాయించారు. నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం మారాక ఆ పనులు నెమ్మదించాయి.బాబు హామీ ఇచ్చారు.. అమలులో విస్మరించారుగతేడాది కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు ప్రక్షాళన మొదలవుతుందని ఆశించారు. మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లలో గుర్రపుడెక్క, పూడిక తొలగింపునకు రూ.14 కోట్ల విలువైన 275 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాగా ఉప్పుటేరు ముంపు సమస్యను పరిష్కరించే విషయాన్ని విస్మరించారు. క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు లేదు క్లోజర్ పనులకు పంపిన ప్రతిపాదనల్లో ఉప్పుటేరు లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉప్పుటేరును అభివృద్ధి చేసేందుకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేసి పంపాల్సి ఉంది. – సత్యనారాయణ, డ్రెయిన్ల శాఖ ఈఈ, భీమవరంఆక్వా మాఫియా ఆక్రమణలుడ్రెయిన్ గట్టును ఆక్వా మాఫియా ఆక్రమించి చెరువులుగా మార్చేయడంతో కుంచించుకు పోయింది. 80 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతుండగా, వీటిలో మూడు వేల ఎకరాలు ఆక్రమణలుంటాయని అంచనా.ఉప్పుటేరు వాస్తవ లోతు - ఆరు మీటర్లు. కానీ ఇప్పుడున్న లోతు ఒకటి నుంచిృరెండుమీటర్లు. వాస్తవ సామర్థ్యం: 25 వేల క్యూసెక్కులు ప్రస్తుత సామర్థ్యం: 12 వేల క్యూసెక్కులు -
భీమవరంలో సైకో హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరంలో సైకో ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. తన కూడా తెచ్చుకున్న కత్తితోనే తన శరీరాన్ని కోసుకున్న సైకో వీరంగం సృష్టించాడు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందాడు. ఉండి గ్రామంలోని పేదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.మరో ఘటనలో.. అన్న కొడుకుపై కత్తితో దాడిమరో ఘటనలో ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకైన నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
రొయ్యకు లోకల్ మార్కెట్
సాక్షి, భీమవరం: రొయ్య ధరల స్థిరీకరణకు స్థానిక వినియోగం పెంచడం మంచి పరిష్కారమని చెబుతున్నారు. ఆ దిశగా ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని, చికెన్ షాపుల్లోనూ రొయ్యల అమ్మకాలు చేయాలని ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సిద్ధంచేసిన లోకల్ మార్కెట్ కాన్సెప్‌్టను ఇప్పుడు కూటమి కమిటీ తెరపైకి తెస్తోంది. ఏడాదికి ఒక్కొక్కరు 10–12 కిలోల సగటు వినియోగంతో రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో చైనా టాప్‌లో ఉంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. యూరోపియన్ దేశాల్లోనూ సగటున ఒక్కొక్కరు ఎనిమిది కిలోల వరకు తీసుకుంటారు. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే మనదేశంలో మాత్రం సగటు వినియోగం 800 గ్రాములు మాత్రమే. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీలో వినియోగం 1.5 కిలోలు ఉన్నట్లు ఫిషరీస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఏటా సుమారు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా మొదటి స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో నకిలీ సీడు, ఫీడు, దళారుల దోపిడీతో కుదేలైన ఆక్వా రంగానికి గత ప్రభుత్వం కొత్త ఊపిరిలూదింది. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారటీ (అప్సడా) ఏర్పాటు చేసి రొయ్య ధరలను లాభసాటి చేయడంతో పాటు, మేత ధరలను తగ్గించి, ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం పెంచకుండా నియంత్రించింది. నాన్ ఆక్వా జోన్ పరిధిలోని వేలాది ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తెచ్చి విద్యుత్ రాయితీ అందజేసింది. రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా చర్యలు తీసుకుంది. ఫిష్ ఆంధ్రా ద్వారా డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 60 శాతం, మిగిలిన వారికి 40 శాతం రాయితీపై జిల్లా వ్యాప్తంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు విలువైన 250కు పైగా అవుట్లెట్లు ఏర్పాటుచేశారు. ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ సబ్సిడీపై అందించారు. రొయ్యల డోర్ డెలివరీకి కార్యాచరణ క్వాలిటీ రొయ్యలను స్థానికంగా సామాన్య వినియోగదారుల చెంతకు చేర్చేలా రొయ్యల డోర్ డెలివరీకి ఏడాదిన్నర క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియ అమలుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్‌పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్‌ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత జిల్లాలోని భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నగరాలు, పట్టణాలకు విస్తరింప చేయా లని భావించారు. 2023 ఏడాది చివర్లో మత్య్సశాఖ జిల్లా అధికార వర్గాలు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈలోగా ఎన్నికలు హడావుడి మొదలు కావడంతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.మరుగున పడేసిన కూటమి కూటమి ప్రభుత్వం రొయ్యల స్థానిక వినియోగం పెంచే కార్యాచరణను మరుగున పెట్టేసింది. అమెరికా ప్రతీకార సుంకాలు అమలులోకి రాకపోయినా వాటిని సాకుగా చూపించి రెండు వారాలుగా ఎగుమతిదారులు రొయ్య ధరలను కౌంట్‌కు రూ.40 నుంచి రూ.90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటం పట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం విజయవాడలో భేటీ అయిన ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా కార్యాచరణ నిర్ణయించడం గమనార్హం. రొయ్యల ప్రాముఖ్యతను వివరిస్తూ సినీ నటులు, ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని, 100, 250, 500 గ్రాములుగా ప్యాకెట్లు చేసి విక్రయించాలని, చికెన్ షాపుల్లో సైతం వీటిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం రొయ్య ధరలు తగ్గకుండా రైతులకు అండగా నిలిచి మద్దతు ధర అందించింది. తర్వాతి కాలంలో ధరలు తగ్గించకుండా ఎక్స్పోర్టర్స్పై నియంత్రణ ఉంచింది. స్థానిక వినియోగం పెంచేందుకు కృషిచేసింది. అదే మాదిరి కూటమి ప్రభుత్వం స్థానిక వినియోగంతో పాటు ఎక్స్పోర్టర్స్పై ఒత్తిడి తెచ్చి రొయ్య ధరలను రైతులకు లాభసాటి చేసేందుకు కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. -
భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయతి్నస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది.విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పారీ్టల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టి ొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్ లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్‌లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది.లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
Sankranti: ఆతిథ్యంలో గోదారోళ్లది అందెవేసిన చెయ్యి
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో.. ఆయ్.. అండి.. రండీభాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.సంక్రాంతి వస్తోందంటేసంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.అత్తల హడావుడి అంతాఇంతా కాదుకొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.వియ్యపురాలా.. నీవొచ్చెవేళకొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్‌పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. -
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతి పందెం పుంజులకు స్పెషల్ ట్రైనింగ్!
సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.అత్యంత గోప్యంగా..కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.5 వేలకు పైగా కోళ్లుకోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.మేత దర్జానే వేరుశిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు. -
స్వరంతో గిన్నిస్ రికార్డు..ఏకంగా 72 గంటల 30 నిమిషాల..!
ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.కమ్యూనిటీ రేడియో !ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
-
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
సాక్షి, భీమవరం: పార్టీతో, కేడర్‌తో ఆయనకు పనుండదు.. అధికారమే పరమావధి.. పరాజయం చెందితే తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కంటికే కనిపించరు.. అందుకే ఆయన్ను ఏరుదాటాక తెప్ప తగలేసే రకమని కొందరు.. ప్యారాచూట్ నేతని మరికొందరు చెప్పుకుంటుంటారు. స్వతహాగా వ్యాపారంలో రాణించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరింత వెనకేసుకున్నారంటారు. చివరకు తన మల్టీఫ్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కోట్లాది రూపాయల పార్కింగ్ ఫీజు రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ఘనుడిగా పేరొందారు భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు).కండువాలు మారుస్తూ.. కృష్ణా జిల్లాకు చెందిన అంజిబాబు భీమవరంలో స్థి రపడ్డారు. వ్యాపారవేత్తగా ఉన్న ఆయన 2009లో దివంగత వైఎస్సార్ చలవతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ కేడర్ ఆయన విజయానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడింది అంతంతమాత్రమే. ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ ఆయనే. బినామీ పేర్లతో అన్ని పనులు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. కాంగ్రెస్ కేడర్‌ను గాలికొదిలేసి 2014 ఎన్నికల్లో పార్టీ ఫిరాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోగా ఆ పార్టీ శ్రేణులు ఆయన కోసం పనిచేశాయి. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అంజిబాబుకు వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఘోర పరాజయం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై ఓటమి చెందిన పులపర్తి ఐదేళ్లుగా టీడీపీకి, ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూట మి పొత్తులో భాగంగా భీమవరం సీటు జనసేనకు రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కండువా కప్పుకుని మరోమారు తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు.ప్రజలను పట్టించుకోలేదు : గత ఎన్నికల్లో ఓట మి అనంతరం టీడీపీ శ్రేణులకు, తనను నమ్ముకుని ఓటేసిన ప్రజలకు ముఖం చూపించకుండా చక్కగా తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అండగా కనీసం సేవా కార్యక్రమాలు నిర్వహించలేదు. మర లా ఎన్నికలు రావడంతో ఇప్పుడు గుర్తొచ్చామా అని పులపర్తిపై ప్రజలు మండిపడుతున్నారు.మింగుడుపడని వైఖరిపులపర్తి వైఖరి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌కు మింగుడుపడటం లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అంజిబాబు పార్టీ పటిష్టతకు, నాయకులు, కార్యకర్తల బాగోగులు గురించి పట్టించుకోరన్న పేరుంది. తన వెన్నంటి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలను కనీసం సంప్రదించకుండా ఆయన పార్టీ మారిపోతుంటారంటారు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే టీడీపీ నాయకులు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క జనసేన కేడర్ ఎన్నికల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఉన్నారంట.వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం పదేళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబుకు తన వ్యాపార ప్రయోజనాలే ప్రధానమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్‌గా వందల కోట్లు వెనకేసుకున్నారంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీర ప్రాంత ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు సంకల్పించిన ప్రాజెక్టు విషయంలోనూ వ్యాపార ధోరణి చూపించారంటారు. ప్రాజెక్టు కోసమని భీమవరం రూరల్ మండలం చిన అమిరంలో సుమారు 50 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి తన సొంతానికి వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. భీమవరంలోని తన మల్లీఫ్లెక్స్ వద్ద ఆర్అండ్బీ, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా పార్కింగ్ ఏర్పాటుచేసి పదేళ్ల పాటు కో ట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశా రు. 2019లో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికై న గ్రంధి శ్రీనివాస్ కన్నెర్రజేయడంతో పార్కింగ్ ఫీజు అక్రమ వసూళ్లకు తెరపడింది. -
మాకొద్దు టీడీపీ కేడర్!
భీమవరం: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలంతా నిన్ను నమ్మంబాబూ అంటుంటే.. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాత్రం టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యరి్థగా పోటీచేసిన అంజిబాబు ఓటర్లకు పంపిణీ కోసం ఇచ్చిన సొమ్మును సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేయడంతో పోలింగ్ రోజున ఓటర్లు ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి గందరగోళం సృష్టించారు. అప్పటి ఎన్నికల్లో అంజిబాబు ఘోరంగా ఓడిపోగా ఆయనకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వ్యా పార, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. దీంతో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అంజిబాబు జనసేన పార్టీ అభ్యరి ్థగా బరిలో నిలిచారు. పార్టీలు మారడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న అంజిబాబు నుంచి అందిన కాడికి అందిపుచ్చుకోవాలనే ప్రయత్నాలు టీడీపీ శ్రేణులు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతోకొంత ఆయన నుంచి చేజిక్కుంచుకోకపోతే ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ప్రయోజనం ఏంటనే నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు అంజిబాబు అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సొమ్ముల కోసం జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట.సొంత మనుషులతోనే కార్యాచరణ టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నించగా గత అనుభవాల దృష్ట్యా అంజిబాబు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి జనాన్ని తరలించడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా తన బంధువులు, కావాల్సిన వారితోనే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డబ్బులు విషయంలో అంజిబాబు అతి జాగ్రత్తగా వ్యవహరించడం టీడీపీ, జనసేన కేడర్‌కు మింగుడు పడటంలేదు. ఎన్నికల్లో ఓడిపోతే అంజిబాబు పత్తా ఉండరు కాబట్టి అయినకాడికి దండుకునే ప్రయత్నాలను కేడర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంత మనుషులతోనే అంజిబాబు ఎన్నికల కా ర్యాచరణ రూపొందించినట్టు సమాచారం. జనసేన శ్రేణుల చిందులు నరసాపురం: పట్టణంలోని దర్గా సెంటర్లో జనసేన ప్రచార కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులపై ఆ పార్టీనాయకులు అసభ్య పదజాలంతో దూషణలు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం డ్యాన్ మాస్టర్ శేఖర్ దర్గా సెంటర్లో జనసేన తరఫున ప్రచార కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కవరేజీకి వెళ్లిన ఓ పత్రిక విలేకరి, మరో న్యూస్ చానల్ జర్నలిస్ట్‌పై అక్కడున్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కెమెరామెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు అడ్డువస్తున్నారు, మీరు ఎవరు? అంటూ రుసరుసలాడాడు.తాము జర్నలిస్టులమని చెప్పబోతుండగా.. జర్నలిస్టులైతే ఐడీ కార్డులు వేసుకుని తిరగాలని గర్జించారు. ‘నేనవరు అనుకుంటున్నావు.. నాయకర్ కెమెరామెన్‌ని, కాబోయే మంత్రి మనిషిని’ అంటూ శివాలెత్తారు. ఇప్పటికే నాయకర్ వ్యవహార తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నాయకర్ అనుయాయుల దురుసు ప్రవర్తనతో ముందుకు వెళుతున్నారు. జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. -
పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోంది
-
భీమవరంలో పవన్ కు షాక్..వైఎస్సార్సీపీలోకి ముఖ్య నేతలు
-
తాను ఒంటరిని కాదని, ప్రతి ఇంటా ప్రజాసైన్యం తనకు తోడుగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పేదలపై బాణాలా?: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. అందరికీ మంచి చేసిన జగన్‌కు ప్రతి ఇంటా మద్దతు ఉంది. ఏ ఇంట్లో చూసినా తోడుగా పేదల సైన్యం ఉంది. జగనే మళ్లీ రావాలని కోట్ల హృదయాలు ఆశీర్వదిస్తున్నాయి. ఒక్క జగన్ మీద చంద్రబాబు 10 మంది సేనానులను తోడు తెచ్చుకుని బాణాలు గురి పెడుతున్నారు. అవి తగిలేది జగన్‌కా? లేక పేదలకా?’’ అనేది ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. 16వ రోజు బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. బాబు గురించి చరిత్ర చెబుతున్న నిజం.. భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి కలసి ఉప్పొంగిన గోదావరిని తలపిస్తోంది. మంచి చేసి మనం, జెండాలు జతకట్టి వాళ్లు తలపడుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? సంక్షేమ రాజ్యాన్ని అబద్ధాలు, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. మీ ఐదేళ్ల భవిష్యత్తు, అక్కచెల్లెమ్మల సాధికారత, పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న భరోసా, పేదలకు సామాజిక న్యాయం కొనసాగుతూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా? అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇవి మన తలరాతలను మార్చే ఎన్నికలు. ఇవి కేవలం చంద్రబాబు – జగన్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఓటు వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది కాబట్టి మీ కుటుంబమంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ అంతటితో ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆయన సాధ్యం కాని అలవిమాలిన హామీలతో వస్తున్నారనేది నిజం. కొంగ జపం.. నటిస్తావెందుకయ్యా? మీరంతా ఈమధ్య చూసే ఉంటారు. చంద్రబాబుకు నాపై కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు హైబీపీ కనిపిస్తోంది. ఏవేవో తిడుతుంటాడు.. శాపనార్ధాలు పెడుతుంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అక్కచెల్లెమ్మలూ.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకో తెలుసా? బాబూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకయ్యా? కొంగ జపాలు ఎందుకు చేస్తున్నావ్? అని అడిగా. అలా అడగడం తప్పా? మీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకంగానీ మంచి పనిగానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని చంద్రబాబును అడిగా. ఆయన పేదలకు చేసింది ఏమీ లేకపోగా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. భార్యలను వదిలేసి.. నియోజక వర్గాలనూ మార్చేసి! ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను కూడా పుట్టించి నాలుగైదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజక వర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావ్! ఏం మనిషివయ్యా నువ్వు? అని ఆయన్ను అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈమధ్య బీపీ బాగా కనిపిస్తోంది. ఒకసారి చేస్తే అది పొరపాటు! మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారయ్యా.. దత్తపుత్రా! పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పుకాదా? ఇదే విషయం నేను అడిగితే తప్పు అట! నిన్ను చూసి అదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే.. ఇలా నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? అని కనీసం ఆలోచన కూడా చేయడు. ఆ పెద్దమనిషికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఇలా.. ఊగిపోతుంటాడు. చేతులు, కాళ్లు, తల..అన్నీ ఊపేస్తుంటాడు. ఇలా అడిగినందుకే బాబుకు, దత్తపుత్రుడికి నాపై కోపం. బాబు వదిన గారికి కూడా కోపం వచ్చింది. బాబు భజంత్రీలకు కూడా పిచ్చి కోపం.. వీళ్లంతా ఊగిపోతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. పేదలపై బాబు బాణాలు.. జగన్ ఒక్కడే.. చంద్రబాబుకు మాత్రం పది మంది సేనానులు. వారంతా బాణాలు గురి పెట్టారు. కానీ అవి తగిలేది ఎవరికి? జగన్‌కా? లేక పేదలకు జగన్ అందిస్తున్న పథకాలకా? వలంటీర్లు–సచివాలయాల వ్యవస్థలకా? ఆర్బీకేలు–విలేజ్ క్లినిక్స్ వ్యవస్థలకా? నాడు – నేడు, ఇంగ్లీషు మీడియంతో మారిన పిల్లల చదువులకా? వారి బాణాలు తగిలేది ఎవరికి? ఇంటింటికీ అందించే పెన్షన్లకు వారి బాణాలు తగులుతున్నాయి. మీ బిడ్డ బటన్ నొక్కడంతో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా గత 58 నెలల్లో పేదలకు అందాయి. మరి వాళ్లు వేసే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక ఆ రూ.2.70 లక్షల కోట్లు అందుకున్న అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తగులుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నా. వారంతా బాణాలు ఎక్కుపెట్టింది మీ అందరి మంచి కోరుతూ మనం తీసుకొచ్చిన వ్యవస్థలపై, పథకాలపై. అక్క చెల్లెమ్మల సాధికారత, పేద బిడ్డల బంగారు భవిష్యత్తు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న రైతు భరోసాపై చంద్రబాబు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధమిది. పుట్టుకతోనే రొయ్యకు మీసాలు.. బాబుకు మోసాలు రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతో ఎలా వచ్చాయో భీమవరంలో తేల్చేద్దాం. బాబు వస్తే జాబులు రావడం కాదు.. ఉన్నవి ఎలా ఊడిపోతాయో, రైతులను ఎలా ముంచాడో మొన్ననే పిడుగురాళ్ల సిద్ధం సభలో చెప్పా. టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును జాకీలు, పొక్లెయిన్లతో లేవనెత్తుతూ చేస్తున్న మోసాలు, పచ్చి అబద్ధాల గురించి ఇవాళ తేలుద్దాం. ఆ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఖాళీ డబ్బాలో రాళ్లు వేస్తే డబడబ సౌండ్ వచ్చిన తరహాలో బాబు వల్లే అభివృద్ధి అంటూ ఊదరగొడుతుంటారు. అసలు బాబుకు – అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందేమో మీరే చెప్పండి. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందీ, సత్య నాదెళ్లను చదివించిందీ తానేనని చెప్పుకునే బాబు పాత డైలాగులు కాసేపు పక్కనబెట్టి మీ అందరికీ బాగా గుర్తున్న 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారో చూద్దాం. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన బాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఎల్లో గ్యాంగ్ డప్పు కొట్టింది. జగన్‌కు అనుభవం లేదు, పిల్లోడని.. బాబుకైతే బాగా అనుభవం ఉంది, ఆయన వస్తేనే అభివృద్ధి అని ఊదరగొట్టారు. చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా.. అదిగో హైపర్ లూప్.. బుల్లెట్ రైలు.. మైక్రోసాఫ్ట్ వచ్చేసిందని.. ఏపీలో ఒలంపిక్స్ అని.. ఆమ్స్టర్ డ్యామ్, సింగపూర్, వెనిస్తో పోటీపడే నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకోలేదా? మరి సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ రైలు వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తెచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలంపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? కనీసం ఎయిర్‌పోర్టులు ఏమైనా కొత్తవి కట్టాడా? జిల్లాకో హైటెక్ సిటీ మీకేమైనా కనిపించిందా? ఎక్కడైనా ఓ మెడికల్ కాలేజీ కట్టాడా? ఇవన్నీ కట్టకపోతే పోనివ్వండి. ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్కూల్‌ని, కనీసం వార్డునైనా బాగు చేశాడా? ఎక్కడైనా ఒక ఊరిలో సచివాలయం, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాడా? గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ను తెచ్చాడా? మీ ఇంటివద్దకే ఆరోగ్య సురక్ష వచ్చిందా? డిజిటల్ లైబ్రరీలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించాడా? రైతన్నకు మేలు చేస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చాడా? ఒక వలంటీర్ వ్యవస్థను తెచ్చాడా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని అభివృద్ధి కింగ్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు? మీదంతా బోగస్ రిపోర్టు కాదా? మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు.. ► వాయువేగంతో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీల పనులు ► కొత్తగా, శరవేగంగా మరో నాలుగు సీ పోర్టుల పనులు ► కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల పనులు వడివడిగా ► కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ► 15 వేలకుపైగా సచివాలయాల ఏర్పాటు ► నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు ► కొత్తగా 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్స్ ► కొత్తగా 11 వేలకుపైగా ఆర్బీకేలు ► కొత్తగా ఇప్పటివరకు 3 వేలకుపైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ► గ్రామానికే ఫైబర్ గ్రిడ్ సదుపాయం ► రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల రాక ► విమానాశ్రయాల విస్తరణ, వాయువేగంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ► 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్, ఎంఎస్ఎంఈలకు ఆపన్న హస్తం ► స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, నేతన్ననేస్తం, ► దేశంలో అభివృద్ధిలో టాప్ 5 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ► ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పథకాలు, సేవలు 2014లో బాబు మోసాలిలా.. రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాడా?రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇల్లు కూడా ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మబలికిన బాబు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించాడా?.. భీమవరంలో కనిపిస్తోందా? ఇన్ని ప్రధాన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? సూపర్ సిక్స్, సెవన్ అంటూ ఇప్పుడు మళ్లీ మోసాలకు బాబు తయారు. వెలిగించండి ఫోన్లలో టార్చిలైట్లు.. ఇవాళ ఎక్కడైనా లంచాలు అనే మాట వినిపిస్తోందా? 58 నెలల్లో ఎలాంటి వివక్ష లేని పారదర్శక వ్యవస్థలను తెచ్చింది మీ బిడ్డ కాదా? గతంలో పెన్షన్ కావాలంటే లంచం.. సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచాలే.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. మాయలు, మోసాలు చేసి గ్రాఫిక్స్ చూపించేవాడిని ఏమంటాం? ఛీటర్.. మోసగాడనే కదా? మాయలోడు అనేకదా అంటాం. మన ఖర్మ ఏమిటోగానీ ఐదేళ్ల క్రితం ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని అన్నాం. చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికీ వివరించండి. మోసాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లలో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. జగన్‌కు తోడుగా కోట్ల గుండెలు.. ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా సిద్ధమేనా? జగన్ ఎన్నడూ ఒంటరి కానే కాదు. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం తోడుగా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో జగనే ఉండాలి.. జగనే రావాలి.. మా బిడ్డే కావాలి అని కోట్ల మంది దీవిస్తున్నారు. ఇంటికే వస్తున్న రూ.3 వేల పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలు జగన్‌కు తోడుగా ఉన్నారు. అమ్మ ఒడి నుంచి చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన దాకా ప్రతి ఇంట్లో పథకాలు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు నా తమ్ముడు, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. బాగుపడ్డ ఆస్పత్రులు, మెరుగైన ఆరోగ్యశ్రీ, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఇంటివద్దే పరీక్షలు – మందులు .. వీటన్నిటితో జీవితాలు మెరుగైన పేదలంతా మాకు తోడుగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని భావిస్తూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. జగన్ ఉంటేనే స్కూళ్లు, పిల్లల చదువులు బాగుంటాయని, మరో 10–15 ఏళ్లలో మా బిడ్డలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక్క జగన్ ఉంటేనే క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుందని, గ్రామాల్లో ఆర్బీకేలు పని చేస్తాయని, దళారీలు లేకుండా పంటను అమ్ముకునే పరిస్థితి ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతన్నా నాకు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ప్రతి ఇంట్లోనూ జగన్‌కు అండగా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉండగా జగన్ ఒంటరి కానే కాదు. హత్యాయత్నంపై దిగజారుడు వ్యాఖ్యలా? నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగనన్నను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. భగవంతుడి దయ వల్ల సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంటే మానవత్వం లేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లకే రూ.3 వేల చొప్పున íపింఛన్లను ఇంటివద్దే అందిస్తున్నందుకు కక్ష గట్టారా? నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు కక్షగట్టారా? సీఎం జగన్‌కు కోట్లాదిమంది ఆశీర్వాదం ఉంది. స్వల్ప వ్యవధిలో సీఎం రెండోసారి భీమవరం రావడం సంతోషంగా ఉంది. పశ్చిమ గోదావరిపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. – గ్రంధి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే -
చంద్రబాబు, పవన్‌ను ఓ ఆటాడుకున్న సీఎం జగన్..
నిజమే.. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సున్నితంగా స్పందిస్తారో కొన్ని అంశాల్లో అయన అంత నిర్దయగా ఉంటారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. పేదలు, రోగులు, ఆపన్నులు.. వృద్ధులు, వికలాంగులు ఎదురైతే అయన ఎంతగా ఆర్తిగా అల్లుకుపోతారన్నది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. వేలాదిమంది హాజరయ్యే జనంలో తన కోసం వెతికే కళ్ళు ఎవరివన్నది అయన క్షణంలో గుర్తించి వాళ్ళను తనవద్దకు తీసుకురమ్మని సిబ్బందిని, పోలీసులను ఆయనే పురమాయిస్తారు.. అంటే ఆర్తితో ఉన్నవాళ్లను అయన అంతగా దగ్గరకు తీసుకుంటారు. అదే తనను అవమానించినవాళ్లను, తనను అవహేళన చేసి వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళను, ప్రజలను వంచించేవాళ్ల విషయంలో సైతం అంతే జోరుగా స్పందిస్తారు. ఈ విషయం భీమవరం సభలో మరోమారు రుజువైంది. ఎక్కడా.. ఈ కోశనా.. చంద్రబాబు, పవన్‌లను బంతి ఆట ఆడేసుకున్నారు. దాదాపు గంటసేపు సాగిన ఈ ప్రసంగంలో సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని రీతిలో ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నియంత్రించడం ఫీల్డర్లకు ఎంతటి కష్టమో భీమవరం సభలో జగన్ గళం నుంచి దూసుకొచ్చిన మాటలతూటాలకు సమాధానం ఇవ్వడం అంతకన్నా కష్టం అని ప్రతిపక్ష కూటమికి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టదు. రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వస్తాయి.. ఒక చీటర్.. ఒక మోసగాడు.. మాయలోడు.. అనదగిన చంద్రబాబు మన ఖర్మకొద్దీ మొన్నటి వరకు మనకు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇంకా ఈ డెబ్బై ఐదేళ్ల వయసొచ్చినా బుద్దిరాని చంద్రబాబు నామీద రాళ్లు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. పోనీ ఆయన ఇన్నేళ్ల పాలనలో తనకు, రాష్ట్రానికి ..ప్రజలకు గుర్తుండే పథకం..ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ పదేపదే జగన్ వేస్తున్న ప్రశ్నకు ఇంతవరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఇక గతంలో అనుభవజ్ఞుడు అంటూ గెలిపించిన చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్యారిస్.. లండన్.. సింగపూర్.. మలేషియా అంటూ బొమ్మలు చూపించారు తప్ప.. ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? జిల్లాకో సైబర్ సిటీ కట్టారా? ప్రతి జిల్లాకు బులెట్ రైలు తెచ్చారా? ఉద్యోగాలు తెచ్చారా? పరిశ్రమలు ఏర్పాటు చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా అంటూ బ్రహ్మోస్ మిస్సైళ్ళ మాదిరిగా దూసుకొచ్చిన ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేశాయి. మన ప్రభుత్వంలో తెచ్చినట్లుగా పోర్టులు.. మెడికల్ కాలేజీలు.. ఆర్బీకేలు.. సచివాలయాలు.. ఆస్పత్రులు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. వీటిలో ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా? అలాంటి చేతగాని చంద్రబాబును జాకీలతో లేపడానికి ఎల్లోమీడియాలు ఎంతో ఆరాటపడుతున్నాయి. రాష్ట్రం ఇలా తయారవడానికి చంద్రబాబు, దత్తపుత్రుడితోపాటు ఎల్లోమీడియా బాధ్యత వహించాలి అంటూ అయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. అంతేగాక గతంలో టీడీపీ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోను సైతం మళ్ళీ ప్రజలముందుకు తెచ్చి ఒక్కో హామీని విడమర్చి చెబుతూ ఇది చేశారా? ఈ పథకం వచ్చిందా? ఈ ప్రాజెక్టు తెచ్చారా అంటూ ప్రజలనుంచే సమాధానాలు రాబడుతూ స్వైరవిహారం చేసారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నేను గుర్తు చేయడమే నా తప్పా? నేను ఆయన్ను అడగడమే నా నేరమా.. అందుకే నామీద చంద్రబాబు కోపమా అంటూ గూటం దించేశారు. మొత్తంగా భీమవరం సభలో జగన్ ప్రసంగం గతంలో సభలకన్నా కాక పుట్టించింది. మొత్తంగా ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఈ టైప్ పొలిటికల్ బౌలింగుతో అయన చిరుత వేగంతో ప్రత్యర్థుల మీదకు విసిరే యార్కర్లకు అట్నుంచి సమాధానం రావడం కష్టమే. - సిమ్మాదిరప్పన్న -
నా మీద ఎందుకంత కోపం బాబు
-
మీ జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు: వైఎస్ జగన్
-
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు
-
దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్య బీపీ కనిపిస్తోంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రసంగం మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వారు.. తలపడబోతున్న ఎన్నికలు ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమే.. దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? నాకేదో అయిపోవాలని చంద్రబాబు ఆరాటం చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ. నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు రాళ్లు వేయండి.. అంతమోందించండని పిలుపునిస్తున్నాడు. చంద్రబాబును ఆడగకూడని ప్రశ్న అడిగా. అందుకే కోపం ఎక్కువా. బాబు, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తింటూ మరోవైపు జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకని బాబును అడిగా. చంద్రబాబు పేరు చెబితే.. పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది కుట్ర మోసం, వెన్నుపోటు నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నాడు ఇప్పుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మారుస్తున్నాడు. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడు దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారు. దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తుంది.. ఊగిపోతా అంటాడు ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది. లంచాలు, వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం నాడు-నేడు ద్వారా విద్య, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చాం మీ బిడ్డకు రైతన్న, అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్ ఎప్పుడూ ఒంటరికాదు. రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారు దలకు మంచి చేసిన ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి యుద్ధానికి వస్తున్నారు రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదు విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా? బాబు వస్తే జాబ్‌లు రావడం కాదు.. ఉన్నవి కూడా ఊగిపోతాయి. సంక్షేమ పథకాలు అందుకున్న వారు నాతో ఉన్నారు. 2014లో రంగురంగుల మేనిఫెస్టో ఇంటింటికీ పంపిణీ చేసిన కూటమి నేతలు హామీలు గాలికొదిలారు జగన్‌కు అనుభవం లేదని. బాబుకు అనుభవం ఉందని ఊదరగొట్టారు ఇదిగో మైక్రోసాఫ్ట్, అదిగో సింగపూర్ అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్ కట్టాడా?బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? ఒలింపిక్స్ జరిగాయా? జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్టు కాదా? -
భీమవరం సభకు చేరుకున్న సీఎం జగన్
-
మళ్లీ జగనే.. బాబు వెన్నులో వణుకు.
-
భీమవరంలో పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్
-
దయచేసి పవన్ కు ఓటేయకండి పవన్ పై భీమవరం ప్రజలు సంచలన వ్యాఖ్యలు
-
భీమవరంలో పిల్లాడిని అడిగినా చెప్తాడు..పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే..!
-
పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాస్ వార్నింగ్.
-
భీమవరంలో YSRCPలోకి భారీగా చేరికలు
-
జనసేనకు అభ్యర్థులే కరువు అయ్యారా.. పవన్‌కు ఏమైంది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏమైంది. ఆయన ఏదిపడితే అది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. ప్రజల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలోనే అప్రతిష్టపాలు అవుతున్నారు. టీడీపీకి బానిసత్వం చేస్తున్నారని విమర్శ ఎదుర్కొంటున్న పవన్.. తాజాగా ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేను జనసేనలో చేర్చుకున్న తీరు చూశాక ఈయన మరింత దిగజారిపోయారని అర్ధం అవుతుంది. భీమవరం సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. కానీ అక్కడ ఆయన తన పార్టీ కోసం పనిచేసేవారికి ఇవ్వడం లేదు. తెలుగుదేశం నుంచి అరువుతెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పి.రామాంజనేయులుకు ఇస్తున్నారు. అంటే అక్కడ జనసేనకు అభ్యర్ధులే కరువు అయ్యారా ! జనసేనలోకి టీడీపీ నేత.. అర్థమేంటి? ఒకవేళ ఉన్నా చంద్రబాబు అదేశాల మేరకు కిక్కురుమనకుండా ఆ పార్టీ వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నారా! నామ్ కే వాస్తే టీడీపీ నుంచి జనసేనలోకి తీసుకు వచ్చి కథ నడిపించారా అన్న డౌటు వస్తుంది. పొత్తులు కుదరకముందు సంబంధిత పార్టీల నుంచి ఫిరాయింపులకు అవకాశం ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. కాని టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇలా ఫిరాయింపులు జరుగుతాయా?. ఫిరాయింపు జరిగితే దానిని టీడీపీ అంగీకరిస్తుందా. టీడీపీ తన నేతను జనసేనలోకి పంపిందంటే దాని అర్ధం ఏమిటి? సాధారణంగా అయితే పొత్తులో ఉన్న పార్టీల మధ్య పార్టీ మార్పిడులు జరిగితే పెద్ద గొడవ అవుతుంది. పవన్ తాపత్రయం ఒక్కడు గెలవడం కోసమా? అలాకాకుండా చంద్రబాబు నోరు విప్పలేదంటే దాని అర్దం తన అనుమతి మేరకే అలా జరిగిందని తేలడం లేదా. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి ఎవరైనా సిగ్గుపడాలి. అలా సిగ్గుపడకపోగా, పవన్ సొంత పార్టీవారిని అవమానిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. 'మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం.. తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి’ అని ఆయన చెబుతున్నారు. జనసేనకు సీట్లు తగ్గిపోయాయని అందరూ అంటున్నారు. 2019 ఎన్నికలలో నా ఒక్క సీటు గెలిచినా ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది అని పవన్ అన్నారు. అంటే ఇప్పుడు తాపత్రయం అంతా తను ఒక్కడే గెలవడం కోసమా?. ఆ వైఫల్యం పవన్‌దే కదా.. 2019లో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం కోసం పవన్ కల్యాణ్ బీఎస్సి, వామపక్షాలతో కలిసి పోటీచేశారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలి తప్ప ఎవరిని తప్పు పడతారు? తను ఒక్కడే గెలవకపోవడానికి తన వైఫల్యం అవుతుంది తప్ప కార్యకర్తలు ఏమి చేయాలి. జనంలో ఆదరణ లేనప్పుడు. అసలు మండలాల వారీగా పార్టీ నిర్మాణమే చేయలేకపోయిన వైఫల్యం పవన్‌దే కదా! ఇంకో రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవ్వాలని జనసైనికులు, కాపు సామాజికవర్గం వారు కోరుకోవడమే తప్పు అనుకోవాలి. అక్కసు, ద్వేషాన్ని కక్కిన పవన్ వ్యక్తిత్వం లేని పవన్ కల్యాణ్ వంటివారు వేరొకరికి ఇంత దారుణంగా సరెండర్ అవుతారని ఆయన అభిమానులు ఊహించలేకపోవడం వారి తప్పు అని భావించాలి. మరికొన్ని వ్యాఖ్యలు చూడండి. భీమవరం అత్యంత కుబేరులు ఉన్న నగరం అట. ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయిందట. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్‌ను తరిమివెయ్యాలని ఆయన అన్నారు. అతనేమైనా మంచివాడా? సమాజానికి అండగా ఉండేవాడా? కాపు కులస్థుడే కావచ్చు. అంటూ ఏదేదో మాట్లాడి సభలో ఉన్నవారందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిని పట్టుకుని క్రిమినల్ అని, తనను ఓడించిన ఎమ్మెల్యేని రౌడీ అని అనడం ద్వారా పవన్ తన అక్కసు, ద్వేషాన్ని వెలిబుచ్చారు. పవన్ రౌడీ కాదా? నిజానికి ఎవరు క్రిమినల్? ఎవరు రౌడీ? వైఎస్సార్సీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని పెద్ద గొంతు వేసుకుని అరచిన పవన్ రౌడీ అవుతారా? లేక ప్రజలకు ఉపయోగపడడం కోసం సొంత భూమిని దానం చేసిన గ్రంధి శ్రీనివాస్ రౌడీ అవుతారా? మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా అదేదో ఘనకార్యంలా చెప్పుకోవడం, అక్కడితో ఆగకుండా భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం క్రిమినల్ చర్య అవుతుందా? లేక అలా చేయకుండా, రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం పలు స్కీములు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి క్రిమినల్ అవుతారా? ఏం చేస్తానో చెప్పలేని స్థితిలో పవన్ పవన్ తాను గెలిస్తే ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న స్కీములపై ఆయన వైఖరి ఏమిటి?పాలనలో తీసుకు వచ్చిన మార్పులను ఎలా చూస్తారు? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, స్కూళ్ల బాగుచేత, తదితర చర్యలు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయా? లేక అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను నాశనం చేసిన వ్యక్తి వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందా? తనే గతంలో అమరావతిని కుల రాజధాని అని ఎందుకు అన్నారు? ఇలాంటి వాటిపై మాట్లాడడానికి తన వద్ద ఎలాంటి సరుకు లేకపోవడం వల్ల రౌడీ, క్రిమినల్ వంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మిగిలిన విషయాలతో పాటు ఇలా రాజకీయ ప్రత్యర్ధిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి బురదచల్లడం కూడా చంద్రబాబు నుంచే ట్రైనింగ్ పొందినట్లు అనిపిస్తుంది.జగన్ ను ఓడించలేకపోతున్నామన్న దుగ్దతో పవన్ కల్యాణ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసూయ మరీ ఎక్కువైతే ఆయనకే అనారోగ్యం . ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకుని మాట్లాడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా చెప్తున్నా.. ఎమ్మెల్యే గ్రంధి
-
Bhimavaram: పోటీ చేసే విషయంలో పవన్ పునరాలోచనలో పడ్డారా?
సాక్షి, భీమవరం: జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం బరిలోకి దిగేందుకు జంకుతున్నారా? గతంలో మాదిరి ఓటమి పాలైతే ఇక రాజకీయ భవిష్యత్ శూన్యమేనా? పోటీ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారా? మిత్రపక్షం టీడీపీ, తన కేడర్ మధ్య కుమ్ములాటలు, మరోపక్క ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ‘లోకల్’ చరిష్మా తనకు చేటు చేస్తాయని భావిస్తున్నారా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల భీమవరంలో టీడీపీ, బీజేపీ నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడంతో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారానికి బలం చేకూరింది. అయితే తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటించుకోకపోవడంతో ఆ పార్టీ కేడర్ పూర్తి నైరాశ్యంలో పడిపోయింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీలో నిలిచారు. జననేత జగన్మోహన్రెడ్డి ప్రభంజనం, వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ లోకల్ బలం ముందు పవన్‌కు ఘోర పరాజయం తప్పలేదు. 8,500 పైగా ఓట్లతో ఆయన పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల సమ యంలో భీమవరంలో మకాం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినా ఎన్నికల అనంతరం గత ఐదేళ్లలో రెండు, మూడుసార్లు తప్ప భీమవరం ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కలగలేదు. దీంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. కొద్దినెలల క్రితం పవన్ భీమవరం వచ్చిన సందర్భంగా సొంత పార్టీ నేతలకే ఆయన్ని కలిసే అవకాశం దక్కలేదు. ‘పార్టీ కోసం లక్షలు ఖర్చుపెడుతున్న తమకే అధినేతను కలిసే భాగ్యం కలగలేదు. ఇంకా మీకెక్కడ’ అంటూ కొందరు నేతలను ఉద్దేశించి జనసేన పార్టీ వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే రేపాయి. మద్దతు కోసం కలిసి.. మౌనంగా మారి.. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. టీడీపీలో గ్రూపు విభేదాలను చక్కదిద్ది వారి మద్దతు కూడగట్టుకునేందుకు రెండు రోజుల క్రితం భీమవరం పర్యటనకు ఆయన విచ్చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ పాకా సత్యనారాయణ నివాసాలకు వెళ్లి స్వయంగా వారిని కలిసి మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించకపోయినా ఇక లాంఛనమే అని పార్టీ కేడర్ భావించింది. స్థానికంగా ఆయన ఉండేందుకు అనువైన ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా చర్చ జరిగింది. ఐదేళ్ల అభివృద్ధి ఆందోళనతోనే.. శనివారం పవన్ విడుదల చేసిన జనసేన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో తాను పోటీ చేసే స్థానం ప్రకటించకపోవడం పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. మిత్రపక్ష భాగస్వామి చంద్రబాబు కుప్పం నుంచి పోటీచేస్తున్నట్టు ప్రకటించగా భీమవరం నుంచి పోటీపై తమ అధినేత ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో కేడర్ అసంతృప్తికి లో నవుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపు రాజకీయాలు తనకు చేటు చేస్తాయన్న ఆందోళనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికితోడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జిల్లాల పునర్విభజన సందర్భంగా భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరిన విషయాన్ని స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల భీమవరంలో జరిగిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ వేదికగా వెల్లడించడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నియోజకవర్గంలో మరింత జనాదరణ పెంచింది. ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్సార్సీపీని ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఆయా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్న ఆందోళనతో భీమవరం నుంచి పోటీచేసే విషయమై పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. -
నీకు ఇక సినిమా షూటింగ్ లే.. పవన్ పై ఎమ్మెల్యే గ్రంధి సెటైర్లు
-
పవన్ భీమవరం పర్యటన... ఏకిపారేసిన ఎమ్మెల్యే గ్రంధి
-
ఓటుకు నోటు : పవన్ కళ్యాణ్ పరమార్థమిదే
సాక్షి, భీమవరం: భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి. ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు. ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..: ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కనీసం భోజనాలకైనా పెట్టుకోపోతే ఎలా? ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం ఓట్లు కొనాలా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి 2019 ఎన్నికలకు జీరో బడ్జెట్ అని ఎప్పుడూ చెప్పలేదు నాయకులందరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే బాగా పని చేయండి అందమైన అబద్దంలో మనమంతా బతుకుతున్నాం అందరూ కోట్లు ఖర్చు పెడుతున్నారు, నేనేమో మాట్లాడొద్దా? అంతా ఫాల్స్ సొసైటీ అయిపోయింది నేను కూడా కామ్ అయిపోవాల్సి వస్తోంది సీట్లు త్యాగం చేసిన వారికి గుర్తింపు ఉంటుంది డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని ఎవరికీ చెప్పలేదు ఎన్నికల సంఘం అభ్యర్థి ఖర్చును 45 లక్షలకు పెంచింది రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా వద్దా అనేది నేను చెప్పను వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు సైలెంట్‌గా కూర్చుంటున్నారు టిడిపి, జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులుండాలి పొత్తు ప్రతిపాదనను ఒప్పించడానికి ఎంత నలిగిపోయానో నాకు తెలుసు కూటమి కోసం జాతీయ నాయకుల దగ్గర ఎన్ని చీవాట్లు తిన్నానో మీకు తెలియదు నేను జనసేన పార్టీ ప్రయోజనాల కోసం నేను ప్రయత్నించలేదు కూటమి బలంగా నిలబడాలన్నది నా కోరిక మనలో మనకు ఇబ్బందులున్నాయి, మన పార్టీ నేతలు త్యాగాలు చేయాలి, తప్పవు త్యాగం చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఇస్తాం మీరంతా టిడిపికి ఓటేస్తే.. ఓటు బదిలీ అయితే అదే మీకు ప్రాతిపదిక అవుతుంది దాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గుర్తిస్తాం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది జనసేన కూడా ఎన్నికల్లో ఓడిపోయి ఉంది ఓడిపోయిన మనం కష్టాల్లో ఉన్న టిడిపికి చేయి అందించాం మేమున్నాం అని టిడిపికి అండగా నిలిచాం నాయకులు అందరినీ నమ్మలేం మేము ఉన్నాం అని రెండు చోట్లా పోటిచేయించి నన్ను ఓడించి ఇప్పుడు పారిపోయారు. -
భీమవరం టీడీపీ తీవ్ర నిరుత్సాహం
-
భీమవరం: పవన్ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. భీమవరం టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్‌తో సమావేశం కోసం ఉదయం నుంచి టీడీపీ నాయకులు వేచి ఉన్నారు. కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మాత్రమే భేటీ జరిగింది. పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దు అవడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా.. అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ధ్వజమెత్తారు. మండలాల వారీ మీటింగ్ పెట్టండి అంటూ సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నాయకులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ పితాని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
టిడ్కో ఇళ్ళలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు
-
జనసైనికులను కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
-
సీఎం జగన్ హామీ.. గంటలో పరిష్కారం
-
మోసాలు, కుట్రలు, కుతంత్రాలే దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడి మేనిఫెస్టో అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం...ఇంకా ఇతర అప్డేట్స్
-
మనసున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, భీమవరం: ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నాటి భీమవరం పర్యటనలో అనారోగ్యంతో, ఇతరత్రా ఇబ్బందులతో బాధ పడుతున్న వారి గోడు విని అప్పటికప్పుడే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతి, దెందులూరు మండలం శ్రీరామవరంనకు చెందిన కంతేటి దుర్గాభవాని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భీమడోలు మండలం పూళ్లకు చెందిన అరుగుల లాజర్ తనయుడు, అదే గ్రామానికి చెందిన నూతుల మార్తమ్మ, యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చిల్లి సుమతి తనయునికి వైద్య సాయం నిమిత్తం ఆర్థిక సాయం, భర్త మృతి చెందిన నరసాపురం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ, ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చెందిన తేతలి గీతలకు పరిహారంగా ఆర్థిక సాయం అందజేశారు. నరసాపురం మండలం ఎల్బీ చర్లకు చెందిన కడలి నాగలక్ష్మికి భూపరిష్కారం నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డిలు తొమ్మిది మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. -
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
మోసాలు, కుట్రలు, కుతంత్రాలు
రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలతో తోడేళ్లంతా ఏకమై మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబుకు కానీ, దత్తపుత్రుడికి కానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి. అన్ని చోట్లా పోటీ చేసే సత్తా లేదు. అందుకే వీళ్లందరూ వంచనను, మోసాన్నే నమ్ముకుంటున్నారు. అమలు చేసిన మంచి స్కీంలేవీ లేవు కాబట్టి.. ఏకంగా రంగు రంగుల వలలతో ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నారు. ఆరు గ్యారెంటీలట. జగన్‌ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? ఆలోచించండి. ఇలాంటి వారి బుద్ధి చూసినప్పుడు ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా అది పలుకునా.. విశ్వదాభిరామ, వినుర వేమ’ అనే వేమన పద్యం గుర్తుకొస్తోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఏలూరు: పద్నాలుగేళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం కాకుండా అవినీతి కోసమే ఉపయోగించి, ఆ అవినీతి సొమ్మును తన వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లుగా వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాం అంతా మనసు లేని పాలన సాగిందని, వాళ్లకు విలువలు లేవు.. విశ్వసనీయత అంతకన్నా లేదని మండిపడ్డారు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలే వారి మేనిఫెస్టో అన్నారు. జన్మభూమి కమిటీలు మొదలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. చంద్రబాబుకు తోడవ్వగా, వీళ్లందరికీ ఒక దత్త పుత్రుడు తోడయ్యాడన్నారు. వీరందరూ కలిసి ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలన చేసిన చరిత్ర లేకపోగా.. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చేశారని నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో మనందరి ప్రభుత్వం మేలు చేసిన విధంగా.. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం విద్యా దీవెన నిధుల విడుదల సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దృష్టిలో అధికారం అంటే వాళ్లు బాగు పడటమేనని, అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు చేసే వీరి రాజకీయం ఎలా ఉంటుందో చెబుతానన్నారు. ‘దుష్ట చతుష్టయానికి చెందిన ముఠా సభ్యుడిని ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించారు. ఆ దత్త పుత్రుడితోనే మొదలు పెడతా. అతనేమో పక్క రాష్ట్రంలో ఉంటాడు. నాన్ లోకల్. పక్క రాష్ట్రంలోనే ఈయన శాశ్వత నివాసం. మన రాష్ట్రంలో అడ్రస్ ఉండదు. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్క పార్టీ వాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండరు. ఈ మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు.. అదే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే నా జీవితమని, అందుకు అంగీకరించని వారు తన పార్టీలో కూడా ఉండకూడదని, వేరే అభిప్రాయం ఉన్న వాళ్లు తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సభల్లో ఉపన్యాసాల్లో చెప్పడం బహుశా ఈయన్ని తప్ప ఎవరినీ చూసి ఉండం’ అని ఎద్దేవా చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. . ప్యాకేజీ కోసం త్యాగాల త్యాగరాజు ► దత్తపుత్రుడికి బాబు పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే. ఏ సీటు ఇవ్వకపోయినా ఒకే. చిత్తం ప్రభూ అంటూ త్యాగాలు చేసే త్యాగరాజు మాత్రం ఈ దత్తపుత్రుడిలోనే చూస్తాం. ఎవరైనా త్యాగాలు ప్రజల కోసం చేస్తారు. కానీ దత్త పుత్రుడు ప్యాకేజీల కోసం త్యాగాలు చేస్తున్నాడు. ఈ మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తాడు. ► పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంటగలుపుతూ, నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, ఇలా కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతున్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారంటే ఆయన ఎలాంటి వ్యక్తో ఆలోచించండి. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కడూ అయనలా చేయడం మొదలు పెడితే మన ఆడబిడ్డలు, చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ఈ దత్తపుతురడు పొలిటికల్ లైఫ్‌లో మాత్రం 10, 15 ఏళ్లు అయినా చంద్రబాబుతో ఉండాల్సిందేనని తన క్యాడర్‌కు చెబుతున్నాడు. ► రెండు విషాలు కలిస్తే అమృతం అవుతుందా.. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కాని ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా? ఒకరేమో పిల్లనిచ్చిన మామ సాక్షాత్తు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్. మరొకరు ఈ దత్త పుత్రుడు. వీరిద్దరి కుటిల నీతి వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా? బాబును సమర్థించేవారు ఆలోచించండి నిజాయతీగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల్లో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి. ఇందులో ఏవీ చేయని చంద్రబాబును సమర్థించే వారు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవన్నీ చూస్తే వారికి కడుపు మండుతుంది. ఎన్ని జలిసిల్ మాత్రలు వేస్తే మాత్రం ఈ కడుపుమంట తగ్గుతుంది! వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేసే ప్రయత్నంలో భాగంగా ఈ దిక్కుమాలిన రాతలు, దిక్కుమాలిన కథనాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఉద్యోగులను సైతం రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఏం చేశారని ఓట్లడుగుతారు? ► 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. కేవలం నాలుగన్నరేళ్లు పనిచేసిన మీ బిడ్డతో ఢీ కొట్టబోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ఏళ్లలో గుర్తు పెట్టుకోదగ్గ మంచి ఏదైనా, ఎవరికైనా, ఎప్పుడైనా చేశాడా? ► ఫలానా మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి.. ఓట్లు వేయాలని అడగగలరా? మీ బిడ్డ హయాంలో అమలవుతున్న అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం అమలు చేశానని ఓట్లు అడగగలరా? ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం మన ప్రభుత్వంలో అమలవుతున్న వైఎస్సార్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇచ్చానని ఓటు అడగగలరా? ► మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ చేయూత కంటే ఇంకా మెరుగైన పథకం అమలు చేసి ఉంటే, దానిని చూపి ఓట్లేయండని అడిగే ధైర్యం ఉందా? ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం నేను చేశానని ఈ బాబు ఓట్లు అడగగలరా? ► డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి.. ఇంత డబ్బు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా? ► ప్రజల బ్యాంకు స్టేట్మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014–2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం చేసిన మేలుతో పోల్చి ఓటు అడగగలడా? కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే.. ఈ ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా? చంద్రబాబు అడగలేడు. ఎందుకంటే ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సచివాలయ వ్యవస్థ ► కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో ఎవరు తీసుకొచ్చారంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ఏ గ్రామంలోనైనా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థతో పింఛను మొత్తం పెంచింది, ఆర్బీకేలు తెచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ► గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, మహిళా పోలీసులు, అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగనే. 104, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్.. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చింది దివంగత మహానేత వైఎస్సార్ అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అమలు చేస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ► రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా, అక్క చెల్లెమ్మలు, రైతన్నలకు సున్నా వడ్డీ, అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అసైన్డ్ భూముల మీద 22ఎ తొలగించి 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది మీ జగనే. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పతురల్లో నాడు–నేడు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీలు, పిల్లలకు ట్యాబులు, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం, రూ.2.45 లక్షల కోట్లు డీబీటీ, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు.. ఈ పేర్లు విన్నప్పుడు గుర్తుకు వచ్చేది మీ జగనే. 11 కొత్త మెడికల్ కళాశాలలు, కొత్తగా 6 పోర్టులు, మరో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. నాటికి, నేటికి తేడా గమనించాలి. -
CM YS Jagan Convoy Entry At Bhimavaram: భీమవరంలో జగనన్నకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
AP CM YS Jagan Bhimavaram Tour: భీమవరం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టినవాడు పవన్ తప్ప ఎవరూ లేరు: సీఎం జగన్
-
దత్తపుత్రుడు.. ఓ త్యాగాల త్యాగరాజు: సీఎం జగన్
పశ్చిమ గోదావరి, సాక్షి: ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. భీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఆ వేదికను ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. .. మనసు రాని ఒకాయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సీఎంగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్టచతుష్టయానికి బిస్కెట్ల వేసినట్లు వేశాడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. వీళ్లకు తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తు పెట్టుకొనేటట్టుగా పాలన చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంమాత్రమే జరిగాయి. ►మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా చేయగలిగాడు. ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేదని ఆలోచన చేయాలి. వాళ్లు చేసిన పరిపాలన వల్ల వాళ్లు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు. విశ్వసనీయత అంతకన్నా లేదు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్లు బాగుపడటం కోసమే. వాళ్లందరినీ కూడా అడగాలని మీ అందరినీ కోరుతున్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో చెబుతా. ►దుష్ట చతుష్టయానికి చెందిన ఈ గ్యాంగ్, ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతా. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు. నాన్ లోకల్. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండడు. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు. తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఎవరినీ చూసి ఉండం. ఈయనను తప్ప. దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజునుమాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ►ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం. రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజీ స్టార్. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం. ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. ►నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, ఇలాంటి వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి ఏమిటి? . ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా? . ఇలాంటి ఆయన ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు. పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు చెబుతున్నాడు. ►నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? . నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా?. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు. వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబం అయినా, పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా? . ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా?. ►వీరి చరిత్ర మరికొంత వివరంగా చెబుతా. చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 3 సార్లు సీఎం అయ్యాడు. మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు. ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి?. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా,ఎప్పుడైనా ఈ పెద్దమనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ఓటు వేయాలని అడగాలి. మన అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం తాను అమలు చేసి ఉంటే చేశాను అని ఓటు అడగాలి. ►పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం అమలవుతున్న వైయస్సార్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ కార్యక్రమం తాను చేసి ఉంటే ఆ ఫలాలను అమలు చేశానని ఓటు అడగాలి. మీ బిడ్డ హయాంలో వైయస్సార్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ అమలు చేసి ఉంటే అవి చేశానని ఓటు అడగాలి. 31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అందులో కడుతున్న ఇళ్లు మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యకక్రమం చేశాను అని ఓట్లు అడగాలి. మీ బిడ్డ హయాంలో నేరుగా డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతోంది. లంచాలు, వివక్ష లేవు. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా? ►ప్రజల బ్యాంకు స్టేట్ మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014-2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి ఓటు అడగగలడా?. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా?. చంద్రబాబు అడగలేడు. ఎవరికీ తాను 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభ అట. మీరందరూ చూసే ఉంటారు. చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా. చంద్రబాబును అడుగుతున్నా. మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం. ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఆ గ్రామంలో, గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్. ►ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ►బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు, జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథలు. దిక్కుమాలిన కథనాలు. ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు. వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని. ►అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హామీలతో వస్తున్నాడు. అమలు చేసిన మంచిగానీ, మంచి స్కీములుగానీ ఇవేవీ లేవు కాబట్టే ఏకంగా మోసాలకు, ఈరోజు మేనిఫెస్టో అట.. ఇద్దరూ కలిసి ఇస్తారట. రంగు రంగుల వలలతో ప్రజల్నిమోసం చేసేందుకు వస్తారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్ ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి. ►ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని. రెండు విషాలు(చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి..) కలిస్తే అమృతం అవుతుందా? నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
స్టూడెంట్ ఇంగ్లీష్ స్పీచ్ కు సీఎం జగన్ ఫిదా
-
విద్య రంగానికి సీఎం జగన్ ఎంతో చేసారు
-
జగనన్న విద్యా దీవెన : ఉన్నత చదువులకు చేయూత.. (ఫొటోలు)
-
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్‌గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్‌గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
కదంతొక్కిన కైకలూరు
సాక్షి, భీమవరం/కైకలూరు: కొల్లేరులో సామాజిక సాధికార నినాదం ఉప్పొంగింది. కోల్లేరే పొంగిందా అన్నట్టుగా కైకలూరును జన సునామీ ముంచెత్తింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్’ నినాదాలతో కైకలూరు నియోజకవర్గం హోరెత్తింది. నియోజకవర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర వేలాది ప్రజలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర కైకలూరు సీతారామ›› ఫంక్షన్ హాల్ నుంచి రైతుబజారు సెంటర్లోని బహిరంగ సభ వేదిక వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వివిధ ప్రాంతాల మహిళలు, గ్రామ పెద్దలు వాహనాలతో యాత్రకు వచ్చారు. సమావేశం ఆద్యంతం ‘జగనే కావాలి–జగనే రావాలి’ నినాదాన్ని హోరెత్తించారు. నాడు వివక్ష.. నేడు సామాజిక సాధికారత: మంత్రి రజిని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల క్రితం వరకు వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం వైఎస్ జగన్ అండతో ఇప్పుడు సామాజిక సాధికారత సాధించి, తలెత్తుకు తిరుగుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగేళ్లలో పేదల సంక్షేమం కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.8 లక్షల కోట్లు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందించారని తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నకు అండగా నిలవాలని కోరారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే: మంత్రి కారుమూరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి పెట్టింది పేరని అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తా¯Œ యాదవ్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారని తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదని విమర్శించారు. బీసీ అయిన జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు రెండింటిలోనూ హామీ ఇచ్చి మోసం చేశారని, సీఎం జగన్ మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు. న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్: ఎంపీ మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారు అభివృద్ధి చెందుతారో సీఎం జగ¯న్ ఆలోచన చేశారన్నారు. దీనికి అనుగుణంగానే ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరిందన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు. అన్నింటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట : మంత్రి జోగి రమేష్ కైకలూరు సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిరావ్ పూలే వంటి మహనీయుల అడుగు జాడల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. కేబినెట్ సహా అన్ని పదవుల్లో, పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాల వారినే సీఎం నియమించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆరి్థకాభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ఈ ఘనత జగన్‌దే: ఎమ్మెల్యే నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క కైకలూరులోనే 15 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల కోసం రూ.746 కోట్లు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
పవన్, లోకేష్ పై గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు
-
బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
భీమవరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర! -
‘యువగళం ముసుగులో ఉన్నది రౌడీ షీటర్లే’
తణుకు: భీమవరంలో దాడులకు ఉసిగొల్పిన నారా లోకేష్‌పై కేసు పెట్టాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అసాంఘిక శక్తులను తన చుట్టూ పెట్టుకుని లోకేష్ దాడులకు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కారుమూరి. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు, నారా లోకేశ్‌ల అరాచకాల్ని ఎండగట్టారు. ‘ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్లో.. ప్రజలపైనే తండ్రీకొడుకుల దాడులు. ప్రశాంతమైన భీమవరంలో ఇలాంటి విధ్వంసమా..?, తండ్రి పుంగనూరులో...తనయుడు భీమవరంలో..!, దౌర్జన్యాలు, దాడులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యువగళం ముసుగులో ఉన్న ఎర్రదండు- రౌడీషీటర్లే.నీ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నావ్ లోకేశ్..?, రెచ్చగొట్టి ప్రజలపై, పోలీసులపై దాడులు చేయిస్తావా..? ,లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగానే ఉంది. మా పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?, సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి కుట్రలకు తెరలేపుతున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే: వ్యూహాత్మకంగా విధ్వంసానికి కుట్ర నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడు. యువగళం వాలంటీర్ల ముసుగులో ఎర్రదండు పేరుతో.. రౌడీషీటర్లు భీమవరంలో విధ్వంసం సృష్టించారు. వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు. నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్ చేశారు. భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు. అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు. స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు. లోకేశ్ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు. రెడ్ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే. కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మొదటి నుంచీ లోకేష్ ధోరణి అదే..: లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు. పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది. మొన్న తండ్రి పుంగనూరులో...నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు. అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు. మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది. టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది. నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది. లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు. మీ నైజం, మీ పార్టీ నైజం ఇదేనని ప్రజలకు చెప్తున్నారా?: ఇలాంటి దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేసి ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నారా..? మీ నైజం, మీ పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా? ఈ రోజు 50 మందిని అరెస్టు చేశారు. ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు. సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి...ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వాగ్ధానాలన్నీ చెత్తబుట్టలో పడేశాడు. మళ్లీ ఎన్నికలు రాగానే కల్లబోల్లి మాటలు చెప్తూ లబ్ధిపొందాలని చూస్తూనే ఉంటాడు. గత ఎన్నికల్లో 650 వాగ్ధానాలు చేసి తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు. జగన్ గారి నాయకత్వంలో.. మన రాష్ట్ర జీఎస్డీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రగతిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన నాయకుడు జగన్ గారు. మీరెన్ని యాత్రలు చేసినా జగన్ గారిలా ఒక్క మంచి పథకం పేరు చెప్పగలిగే సత్తా మీకు లేదు. జగన్ పెట్టిన పథకాలు నేను చేయలేకపోయాను అని ప్రజలకు చెప్పలేక ఇవన్నీ చేస్తున్నాడు. విద్య, ఆరోగ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. సంక్షేమ పథకాలతో నిన్నటి వరకూ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఇదే పెద్ద మనిషి... ఇప్పుడు అవే స్కీంలు పెంచి ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు. చిన్నవాడైన ఇన్ని కార్యక్రమాలు క్యాలెండర్ పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాడని బాబుకు అక్కసుగా ఉంది. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు. మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. అసలు మీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..? ఫ్లెక్సీలను చింపి తగలబెట్టిస్తారా..? ఇక సహించే ప్రసక్తే ఉండదు...పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారు. అలాంటి జిల్లాలో మీరు అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మీరు వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. టీడీపీ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలి. వాళ్లంతా యువగళం పేరుతో రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు. తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడు -
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిన భీమవరం పోలీసులు
-
భీమవరంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల దాడిలో పలువురికి గాయాలు
సాక్షి, భీమవరం: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పచ్చ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. లోకేశ్ భీమవరం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. భీమవరంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ పాదయాత్రలో పచ్చమూకలు రెచ్చిపోయి మరోసారి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడి శారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులకు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు చెదరగొట్టారు. ఎల్లో గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు చేయడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
భీమవరం పంచారామ క్షేత్రానికి భారీగా వచ్చిన భక్తులు
-
భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ దాడులు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి(ఆర్ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు సంబంధించి రూ.10 కోట్ల దాకా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే విజయవాడలో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. -
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై గ్రంథి శ్రీనివాస్ ఫైర్
-
ముగిసిన మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు
భీమవరం(ప.గో.జిల్లా): సిరుల తల్లి.. కల్పవల్లి.. భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయంలో మహా నివేదన (మహా ప్రసాదం) సమర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జరిగిన అఖండ అన్నసమారాధనకు సుమారు 70 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. 29 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. -
అత్తమామల సర్ప్రైజ్కు.. కొత్త అల్లుడు షాక్
-
హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి, మమకారానికి పెట్టింది పేరు. గోదావరి వాసుల అతిథి మర్యాదలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ(బద్రి)–సంధ్య దంపతులు తమ అల్లుడు చవల పృథ్వీగుప్తకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటలతో శనివారం విందు భోజనం పెట్టి అబ్బుర పరిచారు. సేమ్యదద్దోజనం, పెసర పునుకుల పలావు, కొబ్బరి పలావు, పెసర వడలు, తమలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, స్వీట్స్‌లో శనగపప్పు బూరెలు, పాకం గారెలు, ఎర్రనూక హల్వా, ఆకు పకోడి, సగ్గుబియ్యం వడలు వంటి రకాలతో పాటు వివిధ పండ్లు, పొడులు, అప్పడాలు, వడియాలు, బిర్యానీలు, పచ్చళ్లు, వేపుళ్లు, పప్పు కూరలు, ఆకు కూరలతో పాటు పలు రకాల ఐస్‌క్రీమ్స్ వడ్డించగా, వీటిలో ఎక్కువ శాతం ఇంటిలోనే తయారు చేయించడం విశేషం. చదవండి: ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ఘనంగా మావుళ్ళమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు
-
Bhimavaram: మావుళ్ళమ్మ వార్షికోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): మావుళ్లమ్మ అమ్మవారి 59 వార్షిక మహోత్సవాలను ఈ నెల 13 తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో అమ్మవారి వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తి చేశారు. 14 రోజుల పాటు అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేసి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్స్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు నెల రోజులపాటు ఉత్సవాలు మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఈనెల రోజుల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాల చివరి 9 రోజులపాటు అలంకరణలు చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ జానపద నృత్యాలు, భరత నాట్యాలు, హరికథ, బుర్రకథ, పలు కళా ప్రదర్శనలు, భక్తి కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తారు. నెల రోజుల పాటు సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. రూ.90 లక్షల వ్యయంతో నిర్వహణ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే అమ్మవారి మహోత్సవాలకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేస్తారు. గత రెండేళ్లు కరోనా కారణంగా అమ్మవారి ఉత్సవాలు సాధారణంగానే నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడడంతో ఈ ఏడాది సుమారు రూ.90 లక్షలు ఖర్చు చేసి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా తరలి రానున్న భక్తులు ఉత్సవాలను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నెల రోజులపాటు ఆలయం వద్ద సందడి నెలకొంటుంది. సంక్రాంతి పండుగకు వచ్చే జనంతో పాటు భీమవరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కళాప్రదర్శనను, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైటింగ్, సెట్టింగ్స్, విద్యుత్ అలంకరణలను తిలకిస్తారు. అమ్మవారి ఉత్సవాలు నిర్వహించే నెలరోజుల పాటు రోజుకు సుమారు 7 నుంచి 8 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక అమ్మవారి ఉత్సవాల ముగింపు రోజున సుమారు లక్ష మందికి అమ్మవారి ప్రసాదాన్ని భోజన రూపంలో అందిస్తారు. 58 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ గత 58 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకైక ఉత్సవాలుగా మావుళ్లమ్మవారి ఉత్సవాలు ప్రసిద్ది చెందాయి. ఉత్సవాల్లో సినీ నటులను ఘనంగా సువర్ణ కంఠాభరణం, హస్త కంకణంతో సత్కరిస్తారు. (క్లిక్ చేయండి: ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే) -
ఆపరేషన్ జరిగింది.. బాబు కుశలం
-
Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణంలోని ఓ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు, ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. భీమవరం టూటౌన్ సీఐ బి.కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఎ.రఘుకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ అదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టణంలోని టూటౌన్ ఏరియా కెనరా బ్యాంక్ సమీపంలో ఏ9 బ్యూటీ సెలూన్, స్పాపై దాడి చేశారన్నారు. దీనిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద ఝాన్సీలక్ష్మి అలియాస్ నందినితో సహా ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.31,500 నగదు, చెక్కు బుక్, స్వైపింగ్ మెషిన్ వస్తువులను సీజ్ చేశామన్నారు. చదవండి: (Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) స్పా నిర్వహణలో ఝూన్సీలక్ష్మీతోపాటు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన ఇంటి రాహూల్ కూడా ఉన్నట్లు గుర్తించామని, ఇతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. మిగిలిన ఏడుగురు అమ్మాయిలను విజయవాడ హోమ్‌కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మసాజ్, స్పా సెంటర్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీటిపై పర్యవేక్షణ, అకస్మాతు దాడులకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇటీవల ఓ స్పా సెంటర్‌పై కూడా దాడి చేసి అక్కడ వ్యభిచారం చేస్తున్న వారి కూడా అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు మసాజ్, స్పా సెంటర్లపై సకాలంలో దాడులు నిర్వహించి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సీఐలు కృష్ణకుమార్, రఘు, సిబ్బందిని డీఎస్పీ అభనందించారు. వీరికి అవార్డు, రివార్డుల కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై వి.రాంబాబు పాల్గొన్నారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ
-
భీమవరం కాలేజీ హాస్టల్లో దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్ బాక్స్‌లో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
చంద్రబాబు పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్ల ముప్పు
భీమవరం అర్బన్: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు. ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక వర్షాలతో వైరస్ల ముప్పు జూన్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!) భారీగా పెరిగిన రొయ్య ధరలు గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్ రూ.280, 90 కౌంట్ రూ.290, 80 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ. 340, 50 కౌంట్ రూ.360, 45 కౌంట్ రూ.370, 40 కౌంట్ రూ.400, 30 కౌంట్ రూ. 450, 25 కౌంట్ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. వర్షాలతో రొయ్యకు వైరస్ అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్లు సోకడంతో సీడ్ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం ధరలు ఒకేలా ఉండేలా చూడాలి రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్ సీజన్లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. – జడ్డు రమేష్ కుమార్, రైతు, గూట్లపాడురేవు -
‘బిగ్‌బాస్’ హౌస్‌లో భీమవరం బుల్లోడు
సాక్షి, భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన సుంకర సుధీర్ ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ షోకు ఎంపికయ్యాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన సుధీర్ మిమిక్రీలో బంగారు పతకం సాధించి ఆర్జే సూర్యగా గుర్తింపు పొందాడు. పట్టణంలోని 15వ వార్డు అమ్మిరాజు తోటకు చెందిన సుంకర సత్యనారాయణ కుమారుడైన సుధీర్ ఎం.కామ్. వరకు చదివి పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. బిగ్‌బాస్ కార్యక్రమానికి సుధీర్ ఎంపిక కావడంపై పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్) -
ఆ ఆపరేషన్ మాకోద్దు బాబోయ్ అంటోన్న పురుషులు.. ఎందుకంటే
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగవారికే సులభం ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు. మగవారు ముందుకు రావాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి. – కె.ఐశ్వర్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి -
సీఎం వైఎస్ జగన్ పాలన భేష్
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందని ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనేంద్రసింగ్ జిత్త్ బిట్ట (ఎంఎస్ బిట్ట) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ తనకు అన్నయ్య లాంటివారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచివారని, మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కన్నా ఆంధ్రా సురక్షిత ప్రాంతమని, ఆంధ్ర ప్రభుత్వానికి, పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. తెలంగాణ బేకార్ అని, అక్కడ పొలిటికల్ టెర్రరిజం ఉందని, అటువంటి విధానం ఆంధ్రాలో లేదన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రా పోలీసుల భద్రత చాలా బాగుందన్నారు. హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతం కాదని.. కానీ ఆర్థికంగా బలమైందన్నారు. కాగా, భీమవరానికి చెందిన ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు మాండ్రు నారాయణ రమణారావు ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టు ఎంఎస్ బిట్ట చెప్పారు. ముందుగా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శక్తీశ్వరస్వామిని, అనంతరం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామిని ఎంఎస్ బిట్ట దర్శించుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. సివిల్స్ లక్ష్యంతోనే ముందుకు
సాక్షి, భీమవరం: సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమేగా లక్ష్యంగా పనిచేస్తానని గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన భీమవరం పట్టణానికి చెందిన పాలపర్తి జాన్ ఇర్విన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ఏసీఐఓ)గా పనిచేస్తున్న ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. నేరుగా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకున్నానని, సివిల్స్ లక్ష్యంతోనే ముందుకు సాగానని చెప్పారు. సాక్షి: గ్రూప్–1కు ప్రిపేర్ కావడానికి స్ఫూర్తి ఎవరు? ఇర్విన్ : తాతయ్య జేసురత్నమే నా స్ఫూర్తి. ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ప్రజలకు నేరుగా సేవచేసే ఉద్యోగం సంపాదించాలని చెబుతుండేవారు. దాంతో సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. గ్రూప్స్ నోటిఫికేషన్ పడడంతో ఆ దిశగా ప్రయతి్నంచా. సాక్షి: విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా సాగింది? ఇర్విన్: విద్యాభ్యాసం భీమవరంలోనే సాగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. కాలికట్ నిట్‌లో ఎంటెక్ చదివాను. సాక్షి: గ్రూప్–1కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇర్విన్: గ్రూప్–1 కోసం ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. మిత్రుల సహకారం, ఆన్లైన్లో చదవడమే. సివిల్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో గ్రూప్స్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేశా. పరీక్ష బాగా రాసినా రిజల్ట్ రావడానికి ఆలస్యం కావడంతో 2015లో కేంద్ర నిఘా విభాగంలో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని గ్రూప్స్‌కు ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యాను. సాక్షి: తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? ఇర్విన్: మా నాన్న బెల్తాజర్ ఉపాధ్యాయుడు, తల్లి మరియమ్మ గృహిణి. వారి ప్రోత్సహంతోనే ముందుకు సాగా. అపజయాలు ఎదురైనా వెన్నుతట్టి ముందుకు నడిపించారు. సాక్షి: మీ కుటుంబం గురించి? ఇర్విన్: భార్య కేథరినా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె ప్రోత్సహం మరువలేనిది. ఒక కుమారుడు ఉన్నాడు. సాక్షి: గ్రూప్–1 అధికారిగా మీ ప్రాధామ్యాలు ఏంటి? ఇర్విన్: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వారి సక్రమంగా అందేలా కృషిచేస్తా. అదే నా మొదటి ప్రాధాన్యత. -
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం (ఫొటోలు)
-
స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ!
సాక్షి పశ్చిమగోదావరి జిల్లా: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా మోదీని ఆశీర్వదాలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు. ఈ మేరకు మోదీ ఏపీలో పర్యటించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. (చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ) -
AP: మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్
సాక్షి, కృష్ణా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్లబెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేత సుంకర పద్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశాము. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తాము’’ అని అన్నారు. అనంతరం, ఏపీలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కుట్ర పన్నిన దుష్టశక్తులను గుర్తించాలి. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్ -
అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం. బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...) - పెన్మెత్స శ్రీహరిరాజు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి) -
దేశం స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు: సీఎం జగన్
-
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
స్వాతంత్య్ర సంగ్రామంలో విరబూసిన అగ్ని పుష్పం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అగ్ని పుష్పమై వికసించారు. విప్లవ శంఖమై బ్రిటిష్ ముష్కరులకు ముచ్చెమటలు పోయించారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ముస్తాబైంది. అదే జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు ఆయన స్వస్థలం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ఇనుమడింపచేసేలా 125వ జయంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. భీమవరంలో క్షత్రియ సేవా సమితి నేతృత్వంలో సుమారు రూ.3 కోట్లతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీనిని ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించనున్నారు. విలక్షణమైన విద్యార్థిగా.. భీమవరం పట్టణానికి సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్వస్థలం. సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. ఆయన బాల్యం భీమవరం పరిసర ప్రాంతాల్లోనే సాగింది. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ముంబై వెళ్లి ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం నేర్చుకున్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో కొంతకాలం ఫొటో స్టూడియోలు నడిపారు. సీతారామరాజు పుట్టాక 1902లో రాజమహేంద్రవరంలో స్టూడియో ప్రారంభించారు. ఆయన పలు ప్రాంతాలు తిరగడంతో సీతారామరాజు బాల్యం, చదువు కూడా ఆయా గ్రామాల్లోనే సాగాయి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో రాజమండ్రి నుంచి తల్లి సూర్యనారాయణమ్మ సోదరుడు అప్పలనర్సయ్య స్వగ్రామమైన భీమవరం సమీపంలోని కొవ్వాడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 1909లో భీమవరంలోని మిషన్ హైస్కూల్లో ఒకటో ఫారంలో చేరారు. తర్వాత ఆయనకు జ్వరం రావడంతో మూడు నెలల పాటు స్కూల్‌కు వెళ్లలేదు. అనంతరం రాజమండ్రి వెళ్లి అక్కడి స్కూల్లో తిరిగి ఫస్ట్ ఫారంలో చేరారు. అక్కడే యోగాభ్యాసంపై దృష్టి సారించి హఠయోగం, పతంజలి యోగం, వేదాంతం వంటి వాటిని అభ్యసించారు. కళాకారుడిగానూ రాణింపు సీతారామరాజుకు నాటకాలంటే ఆసక్తి. 1912 డిసెంబర్ 12న 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా పిఠాపురంలోని రాజా కళాశాలలో శశిరేఖా పరిణయం నాటకం ప్రదర్శించారు. అందులో సీతారామరాజు శశిరేఖ పాత్ర వేశారు. తర్వాత విశాఖలోని ఏవీఎన్ కాలేజీ హైస్కూల్లో నాలుగో ఫారం కొంతకాలం చదివి.. 1913 జూలై 2న నరసాపురం టేలర్ హైస్కూల్లో నాలుగో ఫారంలో చేరారు. చించినాడలో గుర్రపు స్వారీ టైలర్ హైస్కూల్లో నాలుగో ఫారం చదువుతున్నపుడు ప్రతి శని, ఆదివారాల్లో సమీపంలోని చించినాడ గ్రామం వెళ్లేవారు. అక్కడ పినతండ్రి పినతండ్రి రామకృష్ణంరాజు మిత్రుడైన మునసబుకు చెందిన గుర్రంపై స్వారీ, చదరంగం నేర్చుకున్నారు. అనంతరం తునిలో ఉంటున్న తల్లి వద్దకు చేరుకున్నారు. 1913–17 మధ్య తుని సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారం చేసి ఆదివాసీ జీవితాలను పరిశీలించారు. అనంతరం విప్లవ బాట పట్టి మన్యం ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరు సాగించి 1924 మే 7న వీర మరణం పొందారు. మోగల్లులో స్మారక కేంద్రం మోగల్లులోని అల్లూరి సీతారామరాజు నివాసాన్ని అల్లూరి స్మారక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ సహకారంతో క్షత్రియ సేవా సమితి ఈ పనులు చేపట్టింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సమీకరించి.. పోరాడారు సాక్షి, అమరావతి: అటవీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన అల్లూరి సీతారామరాజు వారి కోసం 1919 నుంచి పోరుబాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు తిరుగుబాటు చేశారు. తొలుత అటవీ ఉత్పత్తులను కొల్లగొడుతూ.. గిరిజనులకు తగిన కూలీ ఇవ్వకపోవడంపై నిలదీశారు. గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది. ఆయుధాల కో సం అల్లూరి నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. గిరిజనుల్లో అల్లూరికి ఆదరణ పెరగడం, ఉద్యమం తీవ్రతరం కావడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను పంపి అల్లూరి పోరాటానికి అడ్దుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. మన్యం పితూరీగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వం ఆపై అస్సాం రైఫిల్స్‌ను కూడా పంపింది. తీవ్ర పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో గాయాలను శుభ్రం చేసుకుంటున్న అల్లూరిని అస్సాం రైఫిల్స్ దళాలు పట్టుకున్నాయి. పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా, మార్గంమధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. అల్లూరి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉండటంతో 1924 మే 7న కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవీపేటకు తరలించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి çస్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిషర్ల దారుణాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోయిన అల్లూరిని మన్యం వీరుడిగా ప్రజలు కొనియాడుతారు. మన్యం పోరాటంలో అల్లూరిని అనుసరించిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. మన్య పోరాటం ముగిసినా.. ఆ చైతన్య స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. పోలీస్ స్టేషన్లపై దాడులకు వందేళ్లు ► సీతారామరాజు తన బృందంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఈ ఏడాదితో సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి ఆ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు. ► 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మొదటిసారి దాడి చేశారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న ఎస్సై లంబసింగి వద్ద అల్లూరికి ఎదురుపడగా.. ‘ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను’ అని రామరాజు చెప్పారని, అతడు మారు మాట్లాడక తప్పుకున్నట్టు చెబుతారు. ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్నెట్లను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్ డైరీలో రాసి.. అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. æ ఆ మర్నాడు ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి. చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆవిష్కరించింది. -
‘ఎంపీ రఘురామను అడుగు పెట్టనివ్వం’
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు. -
ఏపీలో ప్రధాని పర్యటన 2–3 గంటలే
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా.. స్వాతంత్య్ర పోరాట విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతోను ప్రధాని ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు ముచ్చటించే అవకాశమే ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్–టు–మినిట్ కార్యక్రమ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మోదీ.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 – 10.40 గంటల మధ్య గన్నవరం ఎయిర్‌పోర్టుకు వస్తారు. ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు, కొద్దిమంది బీజేపీ నాయకులు పాల్గొంటారు. తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి భీమవరం చేరుకుంటారు. అల్లూరి విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగసభలో ప్రధాని దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు వెల్లడించారు. ఆ సభలో ప్రధానితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు రెండుగంటల పాటు ప్రధాని భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ఢిల్లీ వెళతారని చెప్పారు. భారీ వర్షం కురిస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. రానున్న రెండు రోజుల్లో భీమవరంలో భారీవర్షం కురిసిన పక్షంలో ప్రధాని రాష్ట్ర పర్యటన కొనసాగే అంశంలో సందేహాలున్నట్టు బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు ప్రస్తుతం భీమవరంలోనే ఉన్నారు. విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లను శుక్రవారం కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ పి.జాషువా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందికి ఫొటో గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆదేశించారు. ఈ విధుల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. తొలుత విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్, ఇమ్మిగ్రేషన్, భద్రత తనిఖీ విభాగాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ తదితరులున్నారు. మరోవైపు ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎస్పీజీ దళాలతో పాటు కాన్వాయ్ వాహనాలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. బుధవారం సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్‌లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని మున్సిపల్ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్‌తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. -
జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: ప్రధాని మోదీ జూలై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించే అవకాశా లున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్స వాలను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ బన్సీలాల్ పేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ ఇప్పటికే ఏపీలో ట్రైబల్ మ్యూజియం పనులు మొదలుకాగా, ఇక్కడ అలాంటి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీసం స్థలం కూడా కేటాయించ లేదన్నారు. సీఎం కేసీఆర్ ‘భారత్ రాష్ట్రీయ సమితి’ పెట్టబోతు న్నారన్న దానిపై స్పందించాలని విలేకరులు కోరగా.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు, దేశాన్ని పంచుకోవాలనుకుంటు న్నారని కిషన్‌రెడ్డి ఆరో పించారు. కేసీ ఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడంలో తప్పులేదన్నారు. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే వారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అలగే రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబపాలనను అంతమొందించడానికి, ఫామ్ హౌస్ పాలన పోవడానికి ప్రజలు బీజేపీకి అండగా ఉండాలని కోరారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఇంకా నెల రోజులు సమయం ఉందని, ఇప్పటినుంచే తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూలై 4న ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. వీడియో లింక్ ద్వారా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ కుమార్‌రెడ్డి, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!
ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు. -
భీమవరానికి కొత్త శోభ.. 2 కోట్లతో సుందరీకరణ పనులు
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్‌తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు. 6 చోట్ల స్వాగత ఆర్చ్‌లు భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. పచ్చదనం కోసం రూ. 54 లక్షలు పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?) సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము. – పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ -
మారనున్న ‘పశ్చిమ’ ముఖ చిత్రం
సాక్షి, భీమవరం: భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ముఖచిత్రం మారనుంది. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరాన్ని ‘పశ్చిమ’లో కలుపుతామని ఇటీవల గణపవరంలో జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గణపవరానికి భీమవరం అత్యంత సమీపంలో ఉండటంతో ‘పశ్చి మ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు వినతులు సమర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం ఆక్వా సాగులో పేర్గాంచింది. ప్రస్తుతమున్న ఏలూరు జిల్లా కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ‘పశ్చిమ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 2,278 చ.కి.మీ విస్తీర్ణంతో.. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. గణపవరాన్ని విలీనం చేస్తే మండలాల సంఖ్య 20కి పెరుగుతాయి. మరో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
భీమవరానికి వాకీటాకీలు
వాకీటాకీ.. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో విధినిర్వహణలో ఉపయోగిస్తున్న సాధనం. సమాచారం వేగంగా ఎక్కువమందికి అందించడానికి, సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది. ఇదే విధానాన్ని భీమవరం మున్సిపాలిటీలో కూడా అమలులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సిబ్బందికి త్వరలో వాకీటాకీలు అందుబాటులోకి రానున్నాయి. పాలన పరంగా, మౌలిక వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఇతర ఏ సమస్య ఉన్నా వేగంగా అధికారులు, సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా వీటిని వినియోగించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీకి 80 వాకీటాకీల కోసం రూ.25 లక్షల నిధుల మంజూరు కోసం ప్రతిపాదించారు. మే మొదటి వారంలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఎలా ఉపయోగపడతాయంటే.. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 46 సచివాలయాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కటి చొప్పున వాకీటాకీలు అందిస్తారు. ఆయా వార్డుల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు సచివాలయ సిబ్బందికి గాని, అధికారులకు నేరుగా గాని తెలియజేసినప్పుడు ఆ సమస్య సత్వర పరిష్కారం కోసం సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వాకీటాకీలను ఉపయోగిస్తారు. ఏదైనా అగ్నిప్రమాదం, తుపానులు, వరదల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సమయాల్లో ఉన్నతాధికారులకు వాకీటాకీ ద్వారా సచివాలయ సిబ్బంది సమాచారం తెలియజేసి సాయం అందేలా చేయడానికి వీటిని వినియోగిస్తారు. తద్వారా ఉన్నతాధికారులు సత్వర ఆదేశాలు జారీ చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. మున్సిపల్ కమిషనర్, సెక్షన్ ముఖ్య అధికారులు ప్రతిరోజూ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వారిని అప్రమత్తం చేయడానికి, పాలన పరంగా సేవలు వేగవంతం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సమాచారం అందరికీ ఒకేసారి చేరడం ఇందులో ప్రధాన సౌలభ్యం. సచివాలయాల్లో విధుల్లో ఉండే ఇమ్యూనిటీ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, ఇతర సిబ్బంది వీటిని వినియోగించేందుకు అవకాశముంటుంది. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వద్ద కూడా వాకీటాకీలు ఉండటం వల్ల సమస్య వెంటనే వారి దృష్టికి వెళుతుంది. జిల్లాలో మొట్టమొదటిగా.. వాకీటాకీల వ్యవస్థ నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీ తొలిసారిగా వినియోగించనుంది. 20 ఏళ్ల క్రితం ఇదే మున్సిపాలిటీ వాకీటాకీలను ఉపయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, సిబ్బంది పుష్కలంగా అందుబాటులో ఉండటంతో వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. భీమవరం పట్టణంలో అత్యంత ఎత్తులో ఉండే బీఎస్ఎన్ఎల్ లేదా ప్రైవేట్ టవర్లకు అనుసంధానం చేసి నిరంతరం సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా వాకీటాకీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. మే మొదటి వారంలోనే.. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపాలిటీలో సమస్యల సత్వర పరిష్కారం కోసం వాకీటాకీలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. వీటికోసం ప్రతిపాదనలు పంపించాం. మే మొదటివారంలోనే వాకీటాకీలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్, భీమవరం -
తింటే.. వదలరంతే.. ఏటా రూ.కోటి వ్యాపారం
సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్): రంజాన్ మాసంలో దర్శనమిచ్చే ప్రత్యేక వంటకం హలీమ్. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా దీనిని ఇష్టపడుతుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్నవారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. దీంతో ఏటా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటుచేసి హలీమ్ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. జిల్లాలో 15 ఏళ్ల నుంచి హలీమ్ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రధానంగా భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్ అవుట్లెట్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులను తీసుకువచ్చి ఇక్కడ హలీమ్‌ను తయారు చేయిస్తున్నారు. వారికి నెలకు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. హలీమ్ తయారీ శ్రమతో కూడుకున్న పని. సుమారు 6 గంటలపాటు సమయం పడుతుంది. పరిసర ప్రాంతాలకు సరఫరా చికెన్, మటన్ హలీమ్‌లను తయారుచేస్తారు. వీటిని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుండటంతో హలీమ్ సెంటర్లకు జనం క్యూకడుతున్నారు. దీంతో ఏటేటా జిల్లాలో హలీమ్ విక్రయాలు పెరుగుతున్నాయి. భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్‌ను తయారుచేసి పరిసర ప్రాంతాలకు సరఫరా చేసి అక్కడ ఏర్పాటుచేసిన అవుట్లెట్లలో విక్రయిస్తున్నారు. భీమవరం కేంద్రంగా నరసాపురం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాలకు హలీమ్‌ను సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.కోటి: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఏటా రూ.కోటికి పైగా హలీమ్ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజులపాటు ఒక్కో హలీమ్ కేంద్రంలో ఐదుగురి నుంచి ఆరుగురు ఉపాధి పొందుతున్నారు. నాకు చాలా ఇష్టం నాకు హలీమ్ అంటే చాలా ఇష్టం. రంజాన్ మాసంలో ఎక్కువ సార్లు తింటాను. ఏటా హలీమ్ కోసం ఎదురుచూస్తుంటా. భీమవరంలో హలీమ్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్ హలీమ్ రెండూ కూడా నాకు ఇష్టం. – ఎస్కే.షాజహన్, భీమవరం ఏటా ఏర్పాటు చేస్తున్నాం భీమవరం పెద్ద మసీద్ సెంటర్ వద్ద ఏటా హలీమ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. హలీమ్ తయారీలో చేయి తిరిగిన వారిని హైదరాబాద్ నుంచి తీసుకువస్తాం. భీమవరంలో హలీమ్‌ను చాలా ఇష్టంగా తింటున్నారు. వ్యాపారం బాగుంది. – ఎస్కే బాబు, హలీమ్ సెంటర్ నిర్వాహకులు, భీమవరం -
భీమవరంలో రియల్ ఎస్టేట్ జోరు.. సెంటు రూ.కోటిపైనే!
భీమవరం : విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ది చెందుతున్న భీమవరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో మదుపరులు ఇక్కడ భూముల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. భీమవరం పట్టణంలో ఇప్పటికే కార్పొరేట్ స్ధాయి ఆసుపత్రులు, విద్యాసంస్థలున్నాయి. దీనికితోడు ఆక్వారంగం బాగా విస్తరించడంతో విదేశాలకు సైతం చేపలు, రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. రైతులకు, ఆక్వా వ్యాపారులకు డాలర్ల పంట పండడంతో భీమవరం ఖరీదైన పట్టణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పట్టణం సుమారు 14 కిలోమీటర్లు విస్తరించగా.. ఇటీవల మండలంలోని తాడేరు, చినఅమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే సమయంలో భీమవరం జిల్లా కేంద్రం కావడంతో మరో 10 కిలోమీటర్లు విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేయగా పర్మినెంట్‌గా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడానికి సుమారు 10 ఎకరాలు, ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు మరో 15 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. పర్మినెంట్ జిల్లా కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు ప్రాంతాలపై దృష్టి పెట్టి భూములు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. భీమవరం సెంటర్లో సెంటు రూ.కోటిపైనే రెండేళ్లుగా కరోనా కారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మందగించాయి. అనంతరం ప్రభుత్వం పేదలకు పంపిణీచేసిన ఇళ్లస్థలాల పూడిక కారణంగా ప్రైవేటు భూముల పూడికకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గడం, ప్రైవేటు భూముల పూడికకు అవకాశం ఏర్పడడంతోపాటు భీమవరం జిల్లా కేంద్రంగా అవతరించడంతో కొనుగోలుదారుల కన్ను భీమవరంపై పడింది. భీమవరం పట్టణం నడిబొడ్డున సెంటు స్థలం రూ.కోటి పైమాటే. జువ్వలపాలెం రోడ్డులో సెంటు స్థలం ఇప్పటికే రూ.50 లక్షల వరకు పలుకుతుండగా కుముదవల్లిరోడ్డులో ఇటీవల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెరిగినట్లు చెబుతున్నారు. మూడు నెలల్లో రూ. 18 కోట్ల ఆదాయం భీమవరం పట్టణంలోని గునుపూడి, తాలుకా ఆఫీసు సెంటర్లోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు నెలల్లో సుమారు రూ.18 కోట్ల ఆదాయం వచ్చిందని రెండుచోట్ల నెలకు చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 1,700 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఒక అధికారి చెప్పారు. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వ్యాపారి మాట్లాడుతూ గతంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వాళ్లమని, జిల్లా కేంద్రం కావడంతో భూములు ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు.


