
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.
ఆదర్శనీయుడు వాల్మీకి
మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.