
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ విఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరిగే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.