భీమవరంలో సైకో హల్‌చల్‌ | Psycho Hulchul Bhimavaram West Godavari | Sakshi
Sakshi News home page

భీమవరంలో సైకో హల్‌చల్‌

May 3 2025 2:44 PM | Updated on May 3 2025 3:28 PM

Psycho Hulchul Bhimavaram West Godavari

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరంలో సైకో ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. తన కూడా తెచ్చుకున్న కత్తితోనే తన శరీరాన్ని కోసుకున్న సైకో వీరంగం సృష్టించాడు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందాడు. ఉండి గ్రామంలోని పేదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో..  అన్న కొడుకుపై కత్తితో దాడి
మరో ఘటనలో ఇంట్లో ఫ్యాన్‌ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో  చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్‌ ప్యాన్‌ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకైన నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement