
ఏపీ ప్రభుత్వ వాహనంలో తాను ఈవెంట్కు వెళ్లడంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. ఈ వాహనాన్ని కావాలని తాను అడగలేదని తన నోట్‌లో రాసుకొచ్చింది. ఈవెంట్ నిర్వాహకులు ఆ కారును తన కోసం పంపారని ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేసింది. ప్రభుత్వ వాహనం ఏర్పాటులో తన ప్రమేయం ఏమాత్రం లేదని నిధి అగర్వాల్ తెలిపింది.
కాగా.. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన నిధి అగర్వాల్.. ప్రభుత్వ వాహనంలో వెళ్తూ కనిపించింది. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఇందులో నిధి పాత్ర లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ వాహనం ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనెజర్స్ ఏర్పాటు చేయడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వద్ద ప్రభుత్వ వాహనం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాహనాలను ఏకంగా రెంట్కి ఇచ్చారా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ ఇటీవలే పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో హీరోయిన్‌గా నటించింది.
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025