breaking news
Government car
-
'ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్'.. హీరోయిన్ క్లారిటీ
ఏపీ ప్రభుత్వ వాహనంలో తాను ఈవెంట్‌కు వెళ్లడంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. ఈ వాహనాన్ని కావాలని తాను అడగలేదని తన నోట్లో రాసుకొచ్చింది. ఈవెంట్ నిర్వాహకులు ఆ కారును తన కోసం పంపారని ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేసింది. ప్రభుత్వ వాహనం ఏర్పాటులో తన ప్రమేయం ఏమాత్రం లేదని నిధి అగర్వాల్ తెలిపింది.కాగా.. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన నిధి అగర్వాల్.. ప్రభుత్వ వాహనంలో వెళ్తూ కనిపించింది. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఇందులో నిధి పాత్ర లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ వాహనం ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనెజర్స్ ఏర్పాటు చేయడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వద్ద ప్రభుత్వ వాహనం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాహనాలను ఏకంగా రెంట్‌కి ఇచ్చారా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ ఇటీవలే పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో హీరోయిన్గా నటించింది.pic.twitter.com/wa063DafKo— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025 -
నా కారు.. నా ఇష్టం
ప్రభుత్వ వాహనం ఇంటికి.. సొంత వాహనం ఆయనకు.. కర్నూలు : జిల్లా ప్రథమ పౌరుడు వినియోగిస్తున్న వాహనం చర్చనీయాంశమవుతోంది. సీఎం అయినా.. పీఎం అయినా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్నే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా జెడ్పీ చైర్మన్ సొంత వాహనంలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఇన్నోవా వాహనం కుటుంబ సభ్యుల సేవలో తరిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ వాహనం వినియోగించనప్పుడు కార్యాలయానికి పరిమితం చేయాల్సి ఉంది. సొంత వాహనం వినియోగిస్తున్నట్లయితే.. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డు తప్పనిసరి. ఈ విషయంలోనూ జెడ్పీ చైర్మన్ నిబంధనలకు నీళ్లొదిలారు. ఆయన వినియోగిస్తున్న ఫార్చూనర్పై ప్రభుత్వ వాహనం అనే బోర్డు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ బి.ఆర్.ఈశ్వర్‌ను వివరణ కోరగా.. ప్రభుత్వ వాహనం అనువుగా లేకపోతే సొంత వాహనం వినియోగించుకునే వీలుందన్నారు. చైర్మన్‌కు కేటాయించిన వాహనాన్ని ఆయన కుటుంబ సభ్యులు నగరంలో తిరిగేందుకు మాత్రమే వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వాహనానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.