నా కారు.. నా ఇష్టం | Government car using family member of zp chairman in kurnool district | Sakshi
Sakshi News home page

నా కారు.. నా ఇష్టం

Aug 2 2015 10:00 AM | Updated on Sep 3 2017 6:39 AM

జిల్లా ప్రథమ పౌరుడు వినియోగిస్తున్న వాహనం చర్చనీయాంశమవుతోంది.

ప్రభుత్వ వాహనం ఇంటికి.. సొంత వాహనం ఆయనకు..
 
కర్నూలు : జిల్లా ప్రథమ పౌరుడు వినియోగిస్తున్న వాహనం చర్చనీయాంశమవుతోంది. సీఎం అయినా.. పీఎం అయినా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్నే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా జెడ్పీ చైర్మన్ సొంత వాహనంలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఇన్నోవా వాహనం కుటుంబ సభ్యుల సేవలో తరిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ వాహనం వినియోగించనప్పుడు కార్యాలయానికి పరిమితం చేయాల్సి ఉంది.

సొంత వాహనం వినియోగిస్తున్నట్లయితే.. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డు తప్పనిసరి. ఈ విషయంలోనూ జెడ్పీ చైర్మన్ నిబంధనలకు నీళ్లొదిలారు. ఆయన వినియోగిస్తున్న ఫార్చూనర్‌పై ప్రభుత్వ వాహనం అనే బోర్డు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ బి.ఆర్.ఈశ్వర్‌ను వివరణ కోరగా.. ప్రభుత్వ వాహనం అనువుగా లేకపోతే సొంత వాహనం వినియోగించుకునే వీలుందన్నారు.

చైర్మన్‌కు కేటాయించిన వాహనాన్ని ఆయన కుటుంబ సభ్యులు నగరంలో తిరిగేందుకు మాత్రమే వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వాహనానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement