
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.