 
													ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే అలవాటున్న వారికి షాకింగ్ న్యూస్. దీపావళి సందర్భంగా బెంగళూరు టెక్నీషియన్‌కు ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపు రెండు లక్షల రూపాయల స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి ( టైల్స్) వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా రూ.1.87 లక్షల విలువచేసే తనకెంతో ఇష్టమైన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమానంద్. దీపావళి నాటికి ఫోన్ తన చేతిలో ఉండేలా అక్టోబర్ 14న అమెజాన్ యాప్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం ఆర్డర్ ఆర్డర్ పెట్టాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. ఇక ఎపుడు డెలివరీ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూశాడు. తనకిష్టమైన ఫోన్‌రాలేదు సరికదా రాయి వెక్కిరించింది. అయితే అదృష్టం ఏమిటంటే అక్టోబర్ 19న డెలివరీ అయిన సీల్డ్ ప్యాకేజీని అన్‌బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు. దీంతో అమెజాన్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించింది.
అలాగే దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు మరియు తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. FIR నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. "నేను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ నాకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. దీంతో నా పండుగ ఉత్సాహం అంతా నాశనమైపోయింది. ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా అమెజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ అనుభవం తీవ్ర నిరాశపరిచింది" అని ప్రేమానంద్ తన అనుభవాన్ని షేర్ చేశాడు.
ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్‌లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్‌మెంట్ రింగ్ స్పెషల్!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
