టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ & జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఓపెనింగ్ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబారిగా స్వరోవ్స్కి ఈవెంట్‌లో గౌరవ్ గుప్తా కార్యక్రమంలో రష్మిక మందన్న స్టైలిష్‌గా అరంగేట్రం చేసింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా దుస్తుల్లో రష్మిక ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.
గౌరవ్ గుప్తా రాబోయే హాలిడే 2026 కలెక్షన్ నుంచి రష్మిక మందన్న బెస్పోక్ పెటల్ కార్సెట్ స్కల్ప్ట్ ఫ్రాక్ ధరించింది. దీనికి హై-వెయిస్టెడ్, ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ స్కర్ట్‌తో జత చేసింది. ఇంకా అద్భుతమైన స్వరోవ్స్కీ ఆభరణాలు రష్మిక్ గ్లామర్ లుక్‌ను పెంచాయి. మాస్టరీ ఆఫ్ లైట్ థీమ్‌కు సరిపోయేలా, ఆమె అష్టభుజి-కట్ క్రిస్టల్స్ ఐకానిక్ మిలీనియా చోకర్‌ను ధరించింది. స్వరోవ్స్కీ నెక్లెస్, రెండు ఇయర్ కఫ్‌లతో పాటు సరిపోయే డాంగ్లర్ చెవిపోగులను కూడా ధరించింది. అలాగే రోడియం ప్లేటింగ్‌తో అలంకరించబడిన భారీ స్టేట్‌మెంట్ నడుం బెల్ట్ కూడా అందంగా అమిరి మెడ్రన్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. దీంతోపాటు, ఫోటోగ్రాఫర్‌ల కోసం ఫోజులిస్తున్నపుడు కనిపించిన రింగ్, ఎంగేజ్‌మెంట్ రింగ్ అనే ఊహాగానాలు మాత్రం జోరుగా ఉన్నాయి.

మాస్టర్స్ ఆఫ్ లైట్ - హాలీవుడ్ ఎగ్జిబిషన్ స్వరోవ్స్కీ వేడుకలు నవంబర్ 3 వరకు జరగనున్నాయి. ఇక్కడ ఎన్నె అద్భుతమైన ఫ్యాషన్ , ఐకానిక్ దుస్తులు ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో చెర్, ఎలిజబెత్ ఒల్సెన్, జెఫ్ గోల్డ్‌బ్లమ్, వియోలా డేవిస్, వీనస్ విలియమ్స్, లా రోచ్, లారా హారియర్, ఎమిలీ రాటజ్‌కోవ్స్కీ, డిటా వాన్ టీస్, అనోక్ యాయ్ ,అమేలియా గ్రే వంటి ప్రముఖ హాజరైన ప్రముఖులతో సహా స్టార్-స్టడ్డ్ ప్రేక్షకులను ఆకర్షించింది. 2025 దీపావళి సందర్భంగా రష్మిక మందన్నాను స్వరోవ్స్కి ఇండియా తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈసందర్భంగా కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తోంది. మెట్ గాలా 2025:"టైలర్డ్ ఫర్ యు" అనే థీమ్‌తో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. అరియానా గ్రాండేతో కలిసి స్ప్రింగ్-సమ్మర్ 2025 ప్రచారాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.


