కేజ్రీవాల్‌ ‘శీష్ మహల్ 2.0’ | Swati Maliwal Accuses Arvind Kejriwal of Building Second ‘Sheesh Mahal’ in Punjab | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ ‘శీష్ మహల్ 2.0’: బీజేపీ, స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు

Oct 31 2025 3:39 PM | Updated on Oct 31 2025 4:45 PM

Swati Maliwal and bjp big allegation against Arvind Kejriwal Sheesh Mahal 2.0  in Chandigarh

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన శీష్‌ మహల్‌ కోసం​ పంజాబ్‌ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఆప్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలో కేజ్రీవాల్‌ తన రెండో శీష్‌ మహల్‌ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో శీష్‌ మహల్‌పై  (అద్దాల భవనం 2.0) ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్, బీజేపీ దాడికి దిగింది.  బిగ్‌ బ్రేకింగ్‌ అంటూ శీష్ మహల్ 2.0ను ఫోటోను షేర్‌ చేసింది. పంజాబ్ ప్రజల సొమ్ముతో రాజధాని చండీగఢ్‌లో ఈ అద్దాల మేడను నిర్మించుకున్నారని ట్వీట్‌లో పేర్కొంది. ఈ మేరకు  ఢిల్లీ బీజేపీ యూనిట్‌  ఎక్స్‌  వేదికగా ఓ ఫొటోను విడుదల చేసింది.  

బీజేపీ విడుదల చేసిన ఆ ఫొటోలోని ప్రాంతం చండీగఢ్‌ సెక్టార్ 2లోని ప్రభుత్వ బంగ్లా కాంప్లెక్స్. అందులోనే కేజ్రీవాల్‌ శీష్‌ మహల్‌ నిర్మించుకున్నారని మండిపడింది. కేజ్రీవాల్‌ను పంజాబ్ "సూపర్ సిఎం"గా అభివర్ణిస్తూ, "ఆమ్ ఆద్మీ (సామాన్యుడు) కావాలని కోరుకుంటున్న ఆప్ చీఫ్ మరో 'శీష్ మహల్'ను నిర్మించారని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి కోటా నుండి 2 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన 7 స్టార్ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారంటా విమర్శించింది. 

మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ ప్రభుత్వ వనరులను వ్యక్తిగత విలాసం కోసం దుర్వినియోగం చేస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించడం మరింత సంచలనం రేపింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో మరో శీష్ మహల్ అంటూ ఆరోపణలు ఆరోపించారు. మొత్తం పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేయడంలో నిమగ్నమై ఉందని మలివాల్ ఆరోపించారు. నిన్న, ఆయన (కేజ్రీవాల్) తన ఇంటి ముందు నుండి అంబాలాకు ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లారని, అక్కడి నుంచి పంజాబ్ ప్రభుత్వ ప్రైవేట్ జెట్ ఆయనను పార్టీ పని కోసం గుజరాత్‌కు వెళ్లారని ఆమె ఆరోపించారు.

 

మరోవైపు బీజేపీ తాజా ఆరోపణలపై ఆప్‌ ఇంకా స్పందించలేదు. అయితే చండీగఢ్‌ ఆమ్ ఆద్మీ పార్టీ విభాగం ఆ ఆరోపణలను ఖండించింది. ఢిల్లీలో పార్టీ వివరణాత్మక ప్రకటన జారీ చేస్తుందని తెలిపింది. 

కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాలో నివసించారు. ఆ సమయంలో దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం రూ.7.91 కోట్లు కాగా.. 2020లో రూ. 8.62 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. 2022లో పీడబ్ల్యూడీ శాఖ పనులు పూర్తిచేసే నాటికి ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగి మొత్తం బంగ్లా మరమ్మతుల ఖర్చు రూ. 33.36 కోట్లకు చేరుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అంచనా వేసింది. సెప్టెంబర్ 2024 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఆ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా ఫిర్యాదుపై కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) వాస్తవ నివేదికను సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement