 
													ఒక పక్క మహిళలు, పీరియడ్ సమస్యలను అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీరియడ్ లీవ్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తోంటే హర్యానాలోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైనం కలకలం రపింది. హర్యానాలోని రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో కొంతమంది మహిళా పారిశుద్ధ్య కార్మికులలు తాము పీరియడ్స్‌లో ఉన్నదీ లేనిదీ రుజువు చేసుకోవాల్సిన దుస్తితిపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.అక్టోబర్ 26నక్యాంపస్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అక్టోబర్ 26న మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయాన్ని హర్యానా గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్ సందర్శించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ మహిళలతో సహా పారిశుద్ధ్య కార్మికులందరిని విధులకు పిలిచారు. విధుల్లో ఉన్న పారిశుద్ధ్య మహిళలు ఆలస్యంగా వచ్చారు.మరికొంతమంది సెలవు అడిగారు. రుతుక్రమం, అనారోగ్యంతోఉన్నామని, సిబ్బంది చెప్పినప్పుడు, ఇద్దరు వినోద్, జితేంద్ర సూపర్‌వైజర్లు అబద్ధం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలకు సెలవు ఇవ్వలేదు సరికదా, ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని వీరు బలవంతం చేశారు. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ డ్యూటీకి వచ్చిన ఒక మహిళను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, రుతుక్రమాన్ని మరో మహిళా సిబ్బందితో తనిఖీ చేయించారు. అలాగే ఇలా చేయడానికి నిరాకరించిన మహిళల్ని ఉద్యోగంలోంచి తీసేస్తామని కూడా బెదిరించారు.ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన తెలిపారు.వీరికి తోటి మహిళా సిబ్బంది, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిరసనకు దిగాయి. దిగ్భ్రాంతి కరమైన సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌తో సంఘటన ఫోటోలు . వీడియోలను కూడా బాధితలు పంచుకున్నారు.

వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణన్ కాంత్ దీనిపై ఇంటర్నల్ దర్యాప్తునకు ఆదేశించింది. మరియు దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సూపర్‌వైజర్లతోపాటు, మరొకరిపై కేసు నమోదైంది.
కాగా హర్యానాలో మహిళా ఉద్యోగుల  కోసం ప్రత్యేక పీరియడ్‌లీవ్ విధానమేమీ లేదు. కానీ ఇటీవలి  ఆదేశాల ప్రకారం అన్ని మహిళా కాంట్రాక్టు ఉద్యోగులు (హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ ద్వారా నియమించబడిన వారితో సహా) నెలకు రెండు రోజుల క్యాజువల్ సెలవులు తీసుకోవచ్చు.
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
