 
													నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.
క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యం
మంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.
నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను  పాటించడం అవసరం.
ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.
డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.
AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.
క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.
నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు 
తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.
జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.
ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్‌లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్‌మెంట్ రింగ్ స్పెషల్!)
అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది.
నోటి సంరక్షణ ఎలా?
- ఆయుర్వేద పేస్ట్‌తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. 
- యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ 
- పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం 
- చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్‌ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 
- కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి. 
- నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
