
ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అధికారులు మాత్రమే ప్రభుత్వ వాహనాల్లో తిరిగేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త డిఫరెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రీసెంట్‌గా పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్.. దర్జాగా ప్రభుత్వ వాహనంలో షికార్లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల విజయవాడ నగరంలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరైంది. అయితే ఆమె వేరే ఏ కారులో వచ్చిన పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రభుత్వ వాహనంలో దర్జాగా తిరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారని నెటిజన్లు, ప్రజలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
గత నెల 24న థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది. మరో సినిమా చేయకుండా ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌పైనే ఉండిపోయింది. కానీ ఏ మాత్రం ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో చెప్పుకోదగ్గ పాత్రేం కాదు. అలానే ఫ్లాప్ కావడం కూడా ఓ రకంగా ఈమెకు మైనస్ అయిందని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అమ్మాయిలకు ప్రభుత్వ కారులు సరఫరా.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నులను ఇలా సొంత మనుషులకు వాడుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు#NidhiAgerwal #PawanKalyan #AndhraPradesh #HHVM #UANow #GovtCars pic.twitter.com/eS6ePG4zOl— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 11, 2025