
భాగ్యగరంలో కొత్తగా వినోదం పంచేందుకు మరో మాల్ ప్రారంభమైంది. తాజాగా నార్సింగి ప్రాంతంలో మిరాజ్ సినిమాస్, ఆనంద్ మాల్ అండ్ మూవీస్ను ఇవాళ గ్రాండ్గా లాంఛ్ చేశారు. ఈ కొత్త మాల్లో నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు, సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి, రఘురామ్ గ్రూప్ ఎండీ డాక్టర్ అనందరావు, మిరాజ్ సినిమాస్ ఎండీ భువనేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు.'హైదరాబాద్ నగరానికి సినిమాలే ఊపిరి. ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు దగ్గర్లో ప్రీమియం థియేటర్లు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ అవసరాలు, వినోదం రెండింటినీ నార్సింగిలోని ఈ మిరాజ్ సినిమాస్ తీరుస్తుంది" అని అన్నారు. దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ..'వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే కాదు. అన్ని ఆనందాలూ పంచుకోవడం. ఈ మల్టీప్లెక్స్ వల్ల అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ, కంఫర్ట్ రెండూ లభిస్తాయి. నార్సింగి ప్రాంత వాసులకు ఇది కచ్చితంగా నచ్చుతుందని విశ్వసిస్తున్నా" అని అన్నారు.
కాగా.. ఈ థియేటర్లలో 801 సీట్ల సామర్థ్యంతో ఉండనున్నాయి. మిరాజ్ సినిమాస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినీ అనుభవాన్ని అందించనుంది. అంతేకాకుండా ఈ మాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డీమార్ట్ ఉండనుంది. ఈ మాల్ ఓఆర్ఆర్‌కు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.