
ఫ్యాన్స్‌కు దసరా ట్రీట్ రెడీ చేస్తున్నారు హీరో ప్రభాస్. ఫ్యాంటసీ అండ్ హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో ప్రభాస్ పరిచయ పాట చిత్రీకరణ జరిగింది.
కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గ్రీస్ దేశంలో జరుగుతుందని, అక్కడ ప్రభాస్‌తో పాటు లీడ్ హీరోయిన్స్ పాల్గొనగా కొన్ని పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు. ఇక ఈ దసరా పండక్కి, ‘ది రాజాసాబ్’ సినిమా ట్రైలర్ విడుదల కానుందని తెలిసింది.
ఈ ట్రైలర్ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయని, నిడివి మూడు నిమిషాలకు పైనే ఉంటుందని సమాచారం. ఇలా ఈ దసరా పండక్కి ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు ప్రభాస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్.