
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి.
(‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్‌పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
ఆ ఓటీటీలోనే..
ఓజీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్‌ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.