
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్‌గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్ కల్యాణ్ కోసం తొలిసారి స్పెషల్ సాంగ్‌కి ఓకే చెప్పింది. అలా థాయ్‌లాండ్‌లో ఈ పాటను చిత్రీకరించారు.
సర్‌ప్రైజ్ ఉంటుందన్న బ్యూటీ
ఈ సాంగ్‌లో పవన్‌తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్‌లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్‌ప్రైజ్ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్ సాంగ్‌నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

ఎడిటింగ్‌లో తీసేశారా?
ఎడిటింగ్‌లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్‌లో అయినా ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా యాక్ట్ చేశాడు.
ఓజీ రిలీజ్
శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. టిల్లు స్క్వేర్‌లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్ రంజన్, బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.