
మీరు పొడిచిందేమీ లేదు, మీ వల్ల షోకి మజా కూడా లేదు అనుకున్నాడో ఏమోకానీ వైల్డ్‌కార్డులను దింపబోతున్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో అగ్నిపరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్లను హౌస్‌కి పంపించాడు. అందులో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోమని కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ముందుగా వచ్చిన నలుగురు.. షాకిబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, అనూష రత్నం తామెందుకు అర్హులనేది పాయింట్స్ చెప్పారు.
శ్రీజ, కల్యాణ్‌కు కౌంటర్లు
ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చనగానే శ్రీజ (Srija Dammu) పైకి లేచింది. హౌస్‌లోకి రావాలనుకుంటే ఎవర్ని స్వాప్ చేసుకుంటావ్? అని అడిగింది. అందుకు అనూష.. నీతోనే స్వాప్ చేసుకుంటా.. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడుస్తూనే ఉంటావ్.. నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు అని చెప్పింది. అటు దివ్య కూడా.. శ్రీజతోనే స్వాప్ చేసుకుంటానంది. షాకిబ్, నాగ.. పవన్ కల్యాణ్‌తో స్వాప్ చేసుకుంటామన్నారు. అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ లేదన్నారు.

వీడికి ఇంకో అమ్మాయి కావాలట!
ఈ చర్చలయ్యాక బిగ్‌బాస్ వారిని బయటకు పంపించాడు. దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్, అనూష ఓవర్ స్మార్ట్.. నాగ, షాకిబ్‌లో ఎవరైనా ఓకే అని రీతూ అంది. డిమాన్ మాత్రం.. దివ్య అయితే బాగుంటుందన్నాడు. పక్కనే ఉన్న సంజనా.. వీడికి ఇంకో అమ్మాయి కావాలట.. అంటూ ఏడిపించింది. అనంతరం బిగ్‌బాస్.. ఏ కంటెస్టెంట్ కావాలన్నది హౌస్‌మేట్స్‌తో ఓటింగ్ వేయించాడు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు.
ట్రయాంగిల్ కాస్తా..
ఈ ఆటలో మీ పావు మీరు కదిపారు. ఇప్పుడు నేను అసలైన ఆట ఆడతా అన్నట్లుగా అందరికీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. హౌస్‌మేట్స్‌ను ఆటలో అరటిపళ్లను చేస్తూ తక్కువ ఓట్లు వచ్చిన దివ్య నిఖితను హౌస్‌లోకి పంపించాడు. ఈ దెబ్బకు హౌస్‌మేట్స్ షాకై చూస్తుండిపోయారు. ఇక రావడంతోనే దివ్య.. హౌస్‌లో ట్రయాంగిల్ నడుస్తోంది.. అది దాదాపు స్క్వేర్ యాంగిల్ అవుతుందేమోనని చెప్పింది.

అందరూ షేకయ్యారు
ఆ ఒక్క మాటతో అందరూ వణికిపోయారు. ఇద్దరు పవనాలు (డిమాన్ పవన్, పవన్ కల్యాణ్) మధ్యలో రీతూ అన్న విషయం అందరికీ తెలిసిందే! స్క్వేర్ అన్నదంటే కల్యాణ్.. తనూజను లింక్ చేస్తోందని అర్థం. దివ్య కావాలనే ఈ లవ్ ట్రాక్ గురించి బయటపెట్టింది. నేను ఒక్క మాట చెప్తే దానికి నలుగురు షేక్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు ఎలా ఉంటారో చూస్తానుద! ఏది నిజమైన లవ్ ట్రాక్? ఏది డ్రామా? తెలిసిపోతుంది అని కెమెరాలతో మాట్లాడింది.
మళ్లీ దొంగతనం గోల
ఇక సంజనా.. రానురానూ గజదొంగలా మారిపోతోంది. దొంగతనం తప్ప ఏదీ చేయను అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. తనూజ కాఫీ పౌడర్, సుమన్ సిగరెట్స్ దాచేసిన ఆమె.. ఇప్పుడు దివ్య నిఖిత మేకప్ సామాన్ కొట్టేయాలని పథకం రచించింది. దొంగతనం ఒకసారి చేస్తూ క్యూట్ ఏమో కానీ, ఇలా పదేపదే చేస్తుంటే అది చూసేవారికి రోత పుట్టిస్తుంది. ఈ విషయంలో ఈసారైనా నాగ్.. సంజనాకు క్లాస్ పీకుతాడేమో చూడాలి!