ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా భీమవరం బుల్స్‌ | Bhimavaram Bulls Won Andhra Premier League 2026 Title | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా భీమవరం బుల్స్‌

Jul 1 2026 11:57 AM | Updated on Jul 1 2026 1:06 PM

Bhimavaram Bulls Won Andhra Premier League 2026 Title

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో భీమవరం బుల్స్‌ తొలిసారి విజేతగా అవతరించింది. 2026 ఎడిషన్‌ ఫైనల్లో ఆ జట్టు సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ సాధించింది. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా నిన్న జరిగిన టైటిల్‌ సమరంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైజాగ్‌ లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఈ జట్టు తరఫున త్రిపురణ విజయ్‌ (39 నాటౌట్‌) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మిగతా ప్లేయర్లలో కనీసం​ ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును తాకలేకపోయారు. నిమ్మల హిమకర్‌ 17, రికీ భుయ్‌ 9, హనీశ్‌ రెడ్డి 15, మహీప్‌ కుమార్‌ , బోదల వినయ్‌ 19, గిరినాథ్‌ రెడ్డి 6, ధనుశ్‌ మార్తల 4, రోషన్‌ కమార్‌ 0, కమ్రుద్దీన్‌ 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

భీమవరం​ బౌలర్లలో చెన్నుపాటి రవితేజ (3-0-22-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రవికిరణ్‌, యశ్వంత్‌, హమంత్‌ రెడ్డి, తోట శ్రవణ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బుల్స్‌ ఓపెనర్లు హేమంత్‌ రెడ్డి (59 నాటౌట్‌), రేవంత్‌ రెడ్డి (71 నాటౌట్‌) ఇద్దరూ కలిసి సునాయాసంగా ఊదేశారు. వీరి దెబ్బకు ఆ జట్టు కేవలం 9 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement