సన్మానించిన జేపీ నడ్డా, అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన నితిన్ నబీన్(45) సోమవారం కొత్త బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలిపి, సన్మానించారు.
సంస్థాగత నిర్వహణలో నబీన్‌కు ఉన్న అనుభవం ప్రజా సేవ, దేశ నిర్మాణ ప్రయాణంలో పారీ్టకి కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధానలు ఆయనతో కొద్దిసేపు చర్చలు జరిపారు. అంతకుముందు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నబీన్ సోమవారం మధ్యాహ్నం పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
విమానాశ్రయంలో సీఎం గుప్తా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నబీన్ బీజేపీ కురువృద్ధ నేత మురళీ మనోహర్ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కలుసుకుని, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. బిహార్ అసెంబ్లీకి అయిదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ ప్రస్తుతం నితీశ్ కేబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు.


