లేడీస్‌ హాస్టల్‌లోకి దర్జాగా చొరబడి.. అసభ్యంగా ప్రవర్తించి.. | Bengaluru Horror: Intruder Molests Woman in Ladies’ Hostel, Escapes with Cash | Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్‌లోకి దర్జాగా చొరబడి.. అసభ్యంగా ప్రవర్తించి..

Sep 1 2025 12:55 PM | Updated on Sep 1 2025 2:10 PM

Karnataka Bengaluru PG Woman Incident Video Viral

బహిరంగ ప్రదేశాల్లో వరుస లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తున్న బెంగళూరులో.. మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు అర్ధరాత్రి లేడీస్‌ హాస్టల్‌లోకి చొరబడి ఒకరితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చోరీ సైతం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. 

బెంగళూరు సుద్దగుంటేపాళ్య పీఎస్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు పీజీలోకి ప్రవేశించి.. నిద్రిస్తున్న మహిళను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మెలుకువ వచ్చి గట్టిగా అరిచింది. అయితే కంగారుపడ్డ ఆ వ్యక్తి.. ఆమె బ్యాగ్‌ నుంచి నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో.. ఆమె అతన్ని వెంబడిస్తూ కేకలేస్తూ బయటకు పరుగులు తీసింది. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 

బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై సుద్దగుంటేపాళ్య పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడు దర్జాగా పీజీలోకి చొరబడిన దృశ్యాలు, అలాగే పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. 

బెంగళూరులో పీజీలు, లేడీస్‌ హాస్టల్స్‌లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేయించాలని నిర్వాహకులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 

పోయిన నెలలో బెంగళూరులో ఓ దారుణం జరిగింది. పీజీ నిర్వాహకుడు ఒకడు.. ఓ కాలేజీ యువతిపై అత్యాచారం చేశాడు. బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement