
కర్ణాటక: డ్రాప్ చేస్తామని యువతిని బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన చిక్కబళ్లాపురం పట్టణంలో జరిగింది. స్థానికంగా మెకానిక్ పని చేస్తున్న సికిందర్ బాబా (30), గుజరీ వ్యాపారి జనార్ధనాచారి(31)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సమీప గ్రామానికి చెందిన యువతి పని మీద ఆదివారం చిక్కబళ్లాపురానికి వచ్చింది. సాయంత్రం తిరిగి ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో బైక్‌పై వచ్చిన సికిందర్ డ్రాప్ చేస్తానని ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు.
దారిలో నిర్జన ప్రదేశంలో ఆమైపె అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మళ్లీ స్నేహితుడు జనార్ధనాచారిని తీసుకుని వచ్చి యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను బైక్‌పై కూర్చోబెట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిపోయారు. రోడ్డు మీదే యువతి ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మహిళా ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.
మహిళా వైద్యురాలితో అసభ్య ప్రవర్తన
ఇటీవల బస్సుల్లో కామాంధులు ఎక్కువయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపురం నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్న మహిళా వైద్యురాలిని ఓ దుండగుడు వేధించాడు. ఆమె పక్కన కూర్చుని అసభ్యంగా తాకసాగాడు. దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్‌కు విషయం చెప్పగా, పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఫిరోజ్‌ఖాన్‌ని పట్టించారు. సంజయ్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బస్సులో మరో దురాగతం
బెంగళూరులో ఆర్టీసీ బస్సులో మరో దుస్సంఘటన జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కి మహిళ పక్కనే కూర్చున్నాడు. ప్యాంట్ జిప్ తీసి యువతి దుస్తులపై వీర్యం చిమ్మాడు. ఈ చర్యతో భయంతో యువతి గట్టిగా కేకలు వేసింది. తోటి ప్రయాణికులు ఆ కామాంధున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మార్గమధ్యలో క్యాత్సంద్ర వద్ద బస్సు ఆపి స్థానిక పోలీసులకు అప్పగించారు.