బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియా ఒకటి కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డా. రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే, రామచంద్రరావు.. ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. సదరు మహిళ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో అసభ్యకరంగా తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశారు. అయితే, ఇదంతా డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రికార్డు చేసినట్టు తెలిసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో.. రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఈ వీడియోలపై అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీసు శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీసు ఘటన పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
DGP Ramachandra Rao Scandal: Video Goes Viral 🚨
A video allegedly involving DGP Ramachandra Rao has gone viral, triggering widespread reactions and debate.#DGP #RamachandraRao #ViralVideo #KannadaNews #NavaSamajaNews #BreakingNews pic.twitter.com/KZDXWi6whO— Harshavardhan Reddy (@Harshav21320924) January 19, 2026
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారి రామచంద్రరావు స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఈ వీడియోని తనకు గిట్టని వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారని ఆరోపించారు. కాగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు తండ్రి కావడం గమనార్హం.


