
ఏఐ ప్రతీకాత్మక చిత్రాలు(ఇన్‌సెట్‌లో నిందితుల ఫొటోలు)
ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ డెలివరీ ఏజెంట్‌ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.
మణిపూర్‌కు చెందిన దిలావర్ హుస్సేన్.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించాడు.
అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్ లైఫ్ అనే ట్యాగుతో తన దిల్‌బర్ జానీ-67 పేజీలో అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్ నగర్ పోలీసులకు దిలావర్ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్ చిత్రీకరించి.. నెట్టింట వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్‌ఎస్‌తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్ అసోషియేట్ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్ సింగ్ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్‌లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు.
తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్‌లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరు కూక్ టౌన్ మిల‍్టన్ పార్క్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్‌లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్ 3వ తేదీన బీటీఎం లేఅవుట్‌లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.