భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు! | husband and wife incident in karnataka | Sakshi
Sakshi News home page

భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!

Oct 16 2025 11:58 AM | Updated on Oct 16 2025 12:54 PM

husband and wife incident in karnataka

కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా  అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్‌ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. 

అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్‌ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె  అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్‌తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్‌ చేశారు.  

మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్‌ రాలేదని సెపె్టంబర్‌ 5న భర్త విజయ్‌.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.      నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్‌కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్‌ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్‌కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్‌ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్‌ను  విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement