భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, మమత | India A teams announced for series against Australia Womens A team | Sakshi
Sakshi News home page

భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, మమత

Aug 28 2026 4:22 AM | Updated on Aug 28 2026 4:22 AM

India A teams announced for series against Australia Womens A team

షబ్నమ్‌ , యస్తిక భాటియా , అనుష్క , మమత మదివాలా

ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుతో సిరీస్‌కు భారత ‘ఎ’ జట్ల ప్రకటన

కెప్టెన్‌లుగా యస్తిక భాటియా, అనుష్క శర్మ

సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 2 వరకు సిరీస్‌

న్యూఢిల్లీ: స్వదేశంలో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగే క్రికెట్‌ సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్లను ప్రకటించారు. సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు, ఒక నాలుగు రోజుల మ్యాచ్‌ జరుగుతాయి. భారత ‘ఎ’ టి20 జట్టుకు అనుష్క శర్మ... వన్డే, నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడే భారత ‘ఎ’ జట్లకు యస్తిక భాటియా కెప్టెన్‌లుగా నియమితులయ్యారు. 

మూడు ఫార్మాట్‌ల భారత ‘ఎ’ జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ చోటు సంపాదించగా... నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడే భారత ‘ఎ’ జట్టులో హైదరాబాద్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ మమత మదివాలా ఎంపికైంది. మూడు టి20 మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 12న, 15న, 17న న్యూచండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ మైదానం ఆతిథ్యమిస్తుంది. మూడు వన్డేలను సెప్టెంబర్‌ 20న, 23న, 25న మొహాలీ మైదానంలో నిర్వహిస్తారు. నాలుగు రోజుల మ్యాచ్‌ సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 2 వరకు ధర్మశాలలో జరుగుతుంది. 

భారత ‘ఎ’ టి20 జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్‌), సయాలీ సత్‌ఘరే (వైస్‌ కెప్టెన్‌), వృందా దినేశ్, సుజాత డే, తేజల్‌ హసబి్నస్, నిక్కీ ప్రసాద్, శిప్రి గిరి (వికెట్‌ కీపర్‌), శ్వేత సెహ్రావత్, ఉమా ఛెత్రి (వికెట్‌ కీపర్‌), తనుజా కన్వర్, మిన్ను మణి, వైష్ణవి శర్మ, జింతిమణి కలిత, షబ్నమ్‌ షకీల్, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌.

భారత ‘ఎ’ వన్డే జట్టు: యస్తిక భాటియా (కెప్టెన్, వికెట్‌ కీపర్‌), అనుష్క శర్మ (వైస్‌ కెప్టెన్‌), వృందా దినేశ్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్‌ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా ఛెత్రి, మిన్ను మణి, అమన్‌దీప్‌ కౌర్, వైష్ణవి శర్మ, సయాలీ సత్‌ఘరే, జింతిమణి కలిత, షబ్నమ్‌ షకీల్, అక్షిత భగత్‌.

నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత ‘ఎ’ జట్టు:
యస్తిక భాటియా (కెప్టెన్, వికెట్‌ కీపర్‌), అనుష్క శర్మ (వైస్‌ కెప్టెన్‌), శుభ సతీశ్, ప్రియా పూనియా, తనీషా సింగ్, తేజల్‌ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, మమత మదివాలా (వికెట్‌ కీపర్‌), సుశ్రీ దివ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, వైష్ణవి శర్మ, సయాలీ సత్‌ఘరే, జింతిమణి  కలిత, షబ్నమ్‌ షకీల్, అక్షిత భగత్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement