భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ | Disappointment for Indian womens hockey team | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ

Aug 24 2026 4:13 AM | Updated on Aug 24 2026 4:13 AM

Disappointment for Indian womens hockey team

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ‘డ్రా’  

దక్కని సెమీఫైనల్‌ బెర్త్‌

ఆమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): సెమీఫైనల్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఫలితంగా ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. రెండో దశలో భాగంగా ఆ్రస్టేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ రెండో మ్యాచ్‌ను సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు నెదర్లాండ్స్‌ జట్టు 4–1తో చైనాను ఓడించింది. ఫలితంగా భారత్‌ సెమీఫైనల్‌ చేరాలంటే ఆ్రస్టేలియాను కచ్చితంగా ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అయితే చివరి సెకన్‌ వరకు భారత జట్టు గోల్‌ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. గ్రూప్‌ ‘ఇ’ రెండో దశ మ్యాచ్‌లు ముగిశాక ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. ఆ్రస్టేలియా, భారత్, చైనా 2 పాయింట్లతో సమంగా నిలిచాయి. గోల్స్‌ అంతరంలో భారత్, ఆస్ట్రేలియాలకంటే చైనా (–3) వెనుకబడి సెమీఫైనల్‌కు దూరమైంది. 

గోల్స్‌ అంతరంలోనూ భారత్, ఆ్రస్టేలియా (–2) సమంగా నిలిచాయి. దాంతో చేసిన గోల్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో భారత్‌ (2 గోల్స్‌) కంటే ఒక గోల్‌ ఎక్కువ చేసిన ఆ్రస్టేలియా (3 గోల్స్‌) జట్టుకు సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కింది. ఇదే వేదికపై పురుషుల హాకీ ప్రపంచకప్‌లో నేడు అర్జెంటీనా జట్టుతో భారత జట్టు తలపడుతుంది. (సాయంత్రం గం. 6:15 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం). సెమీఫైనల్‌ చేరాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement