స్వర్ణం గెలిచిన శ్రీనిత్య | Srinithya wins gold medal in National Junior Swimming Championships | Sakshi
Sakshi News home page

స్వర్ణం గెలిచిన శ్రీనిత్య

Aug 24 2026 3:59 AM | Updated on Aug 24 2026 3:59 AM

Srinithya wins gold medal in National Junior Swimming Championships

సుహాస్‌ ప్రీతమ్‌కు కాంస్యం

సామదేవ్, యజ్ఞసాయి ఖాతాలో రజతాలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో చివరిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు మెరిపించారు. మొత్తం నాలుగు పతకాలు సాధించారు. తెలంగాణ అమ్మాయి సాగి శ్రీనిత్య స్వర్ణ పతకం సాధించగా... మైలారి సుహాస్‌ ప్రీతమ్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి మొంగం తీర్థు సామదేవ్‌ రజత పతకం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మొంగం యజ్ఞసాయి కూడా రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీనిత్య 2 నిమిషాల 24.59 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాన్షి మిశ్రా (కర్ణాటక; 2ని:29.13 సెకన్లు) రజతం, మీనాక్షి మేనన్‌ (కర్ణాటక; 2ని:31.99 సెకన్లు) కాంస్యం గెలిచారు. 

పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తీర్థు సామదేవ్‌ (2ని:06.45 సెకన్లు) రెండో స్థానంలో... సుహాస్‌ ప్రీతమ్‌ (2ని:06.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో యజ్ఞసాయి (8ని:41.46 సెకన్లు) రెండో స్థానాన్ని సంపాదించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో తెలంగాణ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 4 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. స్వర్ణ పతకాల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. కర్ణాటక 40 స్వర్ణాలు, 22 రజతాలు, 18 కాంస్యాలతో కలిపి 80 పతకాలు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ను గెల్చుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement