ప్రజ్ఞానంద రెండో గేమ్‌ ‘డ్రా’ | Praggnanandhaas second game drawn | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానంద రెండో గేమ్‌ ‘డ్రా’

Aug 28 2026 4:03 AM | Updated on Aug 28 2026 4:03 AM

Praggnanandhaas second game drawn

సెయింట్‌ లూయిస్‌: గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌ రెండో క్లాసికల్‌ గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ‘డ్రా’ చేసుకున్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాతో జరుగుతున్న ఫైనల్లో ప్రజ్ఞానంద రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి క్లాసికల్‌ గేమ్‌లో ఓడిన ప్రజ్ఞానంద 3–9తో వెనుకంజలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు, నాలుగు బ్లిట్జ్‌ గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. క్లాసికల్‌ గేమ్‌లో గెలిస్తే ఆరు పాయింట్లు లభిస్తాయి. ర్యాపిడ్‌ గేమ్‌లో గెలిస్తే నాలుగు పాయింట్లు, బ్లిట్జ్‌ గేమ్‌లో గెలిస్తే రెండు పాయింట్లు దక్కుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement