breaking news
Nepal Premier League
-
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో సంచలనం
నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్ పశ్చిమ్ రాయల్స్‌తో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లయన్స్ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో సుదుర్ పశ్చిమ్ రాయల్స్, లుంబిని లయన్స్ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ సహా ట్రంపెల్మన్ (2.1-0-3-3), షేర్ మల్లా (4-0-18-3), తిలక్ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.రోహిత్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్, దీపక్ బొహారా, పూనీత్ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్ (13), హర్మీత్ సింగ్ (10), కుగ్గెలిన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ దినేశ్ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లయన్స్ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్ 14, నిరోషన్ డిక్వెల్లా 11, రోహిత్ పౌడెల్ 16 పరుగులు చేసి లయన్స్ గెలుపుతో భాగమయ్యారు. రాయల్స్ బౌలర్లలో హేమంత్ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్ ట్రంపెల్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
భారత దేశవాలీ స్టార్ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కొద్ది రోజుల కిందటే కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ప్రియాంక్.. చిట్వాన్ రైనోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ ఆటగాడు అరంగేట్రంలో చేసిన అత్యధిక స్కోర్ ఇదే.ప్రియాంక్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యాక్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. యాక్స్ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. విదేశీ ప్లేయర్లు మ్యాక్స్ ఓడౌడ్ (30 బంతుల్లో 20 పరుగులు), మార్క్ వాట్ (21 బంతుల్లో 16) పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆఖర్లో పవన్ సర్రాఫ్ (16 బంతుల్లో 27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యాక్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. రైనోస్ బౌలర్లలో సోహైల్ తన్వీర్ (4-0-26-1), రవి బొపారా (3-0-18-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం 167 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రైనోస్‌కు దీపక్ బొహారా (36 బంతుల్లో 42) శుభారంభాన్ని అందించాడు. కెప్టెన్ కుసాల్ మల్లా (15 బంతుల్లో 20), సైఫ్ జైబ్ (16 బంతుల్లో 38) సహకారంతో రవి బొపారా (36 బంతుల్లో 52) రైనోస్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చాడు. చివరి ఓవర్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో అర్జున్ సౌద్ సిక్సర్ బాది రైనోస్‌ను గెలిపించాడు. యాక్స్ బౌలర్లలో సోంపాల్ కామీ (4-0-33-2) మెరుగైన ప్రదర్శన చేశాడు.కాగా, ప్రియాంక్ పంచల్ ఇటీవలే భారత దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పరాయి దేశ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాడు. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే భారత క్రికెట్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలి. ప్రియాంక్‌కు ముందు టీమిండియా గబ్బర్‌గా పిలువబడే శిఖర్ ధవన్ నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ లీగ్ గతేడాదే పురుడు పోసుకుంది.దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ప్రియాంక్.. టీమిండియాకు మాత్రం ఆడలేకపోయాడు. గుజరాత్‌కు చెందిన 35 ప్రియాంక్ 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటున, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. చదవండి: IRE vs BAN: రహీమ్, లిట్టన్ దాస్ సెంచరీలు.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్పీఎల్లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.గుజరాత్‌కు చెందిన 35 పంచల్‌కు దేశవాలీ సూపర్ స్టార్‌గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా జరిగిన హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్‌కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చదవండి: రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్ -
శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్‌లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్‌కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చిట్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్‌నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్‌లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024


