చిత్రమైన కాన్సెప్ట్‌తో శ్రీహరి కొడుకు సినిమా.. టీజర్ రిలీజ్ | Srihari Son Megamsh Aasmaan Movie Teaser | Sakshi
Sakshi News home page

Aasmaan Movie: హిందీలో కాదు అరబిక్ భాషలో మూవీ రిలీజ్

Sep 16 2026 2:39 PM | Updated on Sep 16 2026 3:01 PM

Srihari Son Megamsh Aasmaan Movie Teaser

మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వం వహించిన ‘ఆస్మాన్’. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా బుధవారం టీజర్‌ విడుదల చేశారు. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ లాంటి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్రాల్ని విడుదల చేస్తుంటారు. కానీ దీనిని మాత్రం హిందీలో కాకుండా అరబిక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించుకున్నారు.

‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. టీజర్ అయితే కాస్త డిఫరెంట్‌గా ఉంది. పాత్రలన్ని కళ్లకు గంతలు కట్టుకోవడం లాంటి సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement