breaking news
Isha Rikhi
-
నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్ బాద్షా (ఫోటోలు)
-
సీక్రెట్‌గా సింగర్‌ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6)


